AP Free Cylinder: ఏపీలో ఇలా బుక్ చేసుకుంటేనే ఫ్రీ సిలిండర్..
AP Free Cylinder: ఎన్నికల హామీల్లో భాగంగా దీపావళి నుంచి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేటి నుంచి లబ్ధిదారులు బుక్ చేసుకోవాలని సూచించింది.
తెల్ల రేషన్‌కార్డు కలిగి, గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారంతా ఈ పథకానికి అర్హులు. గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్న వారు ముందుగా సొమ్ము చెల్లించాక వారి వ్యక్తిగత ఖాతాల్లో ప్రభుత్వం నగదు బదిలీ విధానం ద్వారా తిరిగి డబ్బులు జమ చేయనుంది.
దీంతో ప్రస్తుతం పాత పద్దతిలోనే సిలిండర్లు బుక్ చేసుకోవాల్సి వుంటుంది. మొదటి సిలిండర్‌ను ఈ నెల 29వ తేది నుంచి బుక్ చేసుకోవాలి.
రెండో సిలిండర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూలై 31 లోపు, మూడవది ఆగస్టు 1 నుంచి నవంబరు 30వ తేదీ లోపు పొందాల్సి వుంటుంది.
మొత్తంగా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఒక్కో హామిని అమలు చేసుకుంటూ వెళుతుంది. మరోవైపు అమ్మఒడి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి దశల వారీగా అమల్లో తీసుకొచ్చే యోచనలో ఉంది ప్రభుత్వం.