Russia destroys Antonov an225 : ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్‌ని నాశనం చేసిన రష్యా!
ఆంటోనోవ్ ఏఎన్-225 అత్యంత భారీ సైజులో ఉండే విమానం. ఇది కార్గో అవసరాలు మాత్రమే వాడుతారు. మనుషుల రవాణాకు వాడితే ఇది వేల మందిని ఓకేసారి తీసుకోపోగలదు.
ఆంటోనోవ్ ఏఎన్-225లో 300 టన్నుల ఇంధనం పడుతుంది. ఒకసారి పూర్తి ఇంధనం నింపుకుంటే.. 18 వేల కిలో మీటర్లు ఆగకుండా ప్రయాణిస్తుంది.
విమానం సైజు రెండు ఫుడ్‌బాల్ గ్రౌండ్లంత పొడవు ఉంటుంది. అందుకే ఇది సాధారణ విమానాశ్రయాల్లో ల్యాండ్ అవదు. మన దేశంలో కేవలం ఒకే ఒక్క సారి (2016లో) అది కూడా హైదరాబాద్‌లో ఈ విమానం ల్యాండ్ కావడం విశేషం.
సాధారణ విమానాలకైతే రెండు, కార్గో విమాననలకైతే 4 ఇంజిన్లు ఉంటాయి. కానీ.. ఆంటోనోవ్ ఏఎన్-225లో ఆరు భారీ సైజున్నఇంజిన్లు ఉంటాయి.
ఈ విమాన ఒకే సారి 640 టన్నుల కర్గోను మోసుకుపోగల సామర్థ్యం దీని సొంతం. ఈ విమానాన్ని మ్రియా అని కూడా పిలుస్తుంటారు.