Anupama Parameshwaran: పింక్ చీరలో నిగనిగలాడిన అనుపమ.. చలికాలంలో సెగలు పుట్టించిన భామ
Anupama in Pink: ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాలో నాగవల్లి క్యారెక్టర్ లో కనిపించి అందరిని మెప్పించింది.
అనుపమకి హీరోయిన్ గా తెలుగులో మొదటి సూపర్ హిట్ వచ్చింది మాత్రం శతమానం భవతి సినిమాతో. శరవానంద్ హీరోగా చేసిన ఈ సినిమా.. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చి ఫ్యామిలీ ప్రేక్షకులను మంచిగా ఆకట్టుకుంది.
ఇక ఆ తరువాత నానితో.. కృష్ణార్జున యుద్ధం.. రామ్ తో ..ఉన్నది ఒకటే జిందగీ.. సాయి ధరమ్ తేజ్ తో.. తేజ్ ఐ లవ్ యు.. లాంటి సినిమాలలో నటించింది.
కాగా నిఖిల్ తో చేసిన కార్తికేయ 2 చిత్రం మాత్రం పాన్ ఇండియా పరంగా ఈ హీరోయిన్ కి సూపర్ సక్సెస్ సాధించి పెట్టింది.
తెలుగులోనే కాకుండా ఈ కార్తికేయ 2 సినిమా హిందీలో సైతం భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆ తరువాత నిఖిల్ తో మరోసారి 18 పేజెస్ సినిమాలో కనిపించింది ఈ హీరోయిన్.
ఇక ప్రస్తుతం అనుపమ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. పింక్ షైనింగ్ శారీలో.. మ్యాచింగ్ బ్లౌజ్ తో.. తన మేకప్ రూమ్ లో కూర్చొని ఫోజులు ఇచ్చింది అనుపమ.
ఈ పింక్ షైనింగ్ శారీలో అనుపమ ధగధగలాడిపోతూ చలికాలంలో సైతం వేసవికాలంలా సెగలు తెప్పిస్తొంది ఈ హీరోయిన్.