AP: అల్పపీడనం.. తీవ్ర వాయుగుండం ఈ జిల్లాలో భారీ వర్షాలు..!
మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోంది. అక్టోబర్ నెలలో కూడా అల్పపీడనాలు ఏర్పడుతూనే ఉన్నాయి. అయితే, ఈసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.
దీంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది.
ఇది రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి.
ముఖ్యంగా రాయలసీమలో అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరికోతలకు వెళ్లే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ముఖ్యంగా మత్స్యకారులను కూడా అలెర్ట్ చేసింది.
అయితే, ఈ అల్పపీడనం తీవ్ర తుఫానుగా కూడా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తర్వాత ఇది బలహీనపడి ఐదురోజుల్లో ఏపీలో తీరం దాటుతుందని వెల్లడించింది.