iPhone SE 4: ఆపిల్ నుంచి అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఎప్పుడు, ఎలా ఉంటుంది
iPhone SE 4 ర్యామ్
ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ పని చేయాలంటే 8జీబీ ర్యామ్ ఉండాల్సిందే. అంటే iPhone SE 4లో 8జీబీ ర్యామ్ ఉంటుందని అంచనా.
iPhone SE 4లో ఆపిల్ ఇంటెలిజెన్స్
iPhone SE 4లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉండవచ్చు. ఆపిల్ కంపెనీకు చెందిన బెస్ట్ ఫీచర్ ఇదే. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఐవోఎస్ 18 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ఏ17 ప్రో చిప్ ఉండవచ్చు
iPhone SE 4 డిస్‌ప్లే
iPhone SE 4లో ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు ఫేస్ ఐడీ, ఆల్ స్క్రీన్ లుక్ ఉంటుంది. ఇందులో హోమ్ బటన్ ఉండదు. iPhone SE 4 రేర్ ప్యానెల్ ఐఫోన్ 16లా ఉంటుంది.
iPhone SE 4 ధర
iPhone SE 4 లాంచ్ అయితే ఆపిల్ కంపెనీకు చెందిన అత్యంత చౌక ఫోన్ ఇదే కానుంది. iPhone SE 3 గతంలో 43,900 రూపాయలకు లాంచ్ అయింది. ఇప్పుడు iPhone SE 4 ధర 50 వేల కంటే తక్కువ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఆపిల్ మిడ్ రేంజ్ ఫోన్
iPhone SE 4 గురించి గత కొద్ది నెలలుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆపిల్ గ్లో టైమ్ ఈవెంట్ 2024లో ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ అయింది. ఇక అప్పట్నించి ఆపిల్ కంపెనీ iPhone SE 4 ఎప్పుడు లాంచ్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు.