Ashadamasam: ఆషాడంలో మహిళలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు..?.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం మీకు తెలుసా..?
ఆషాడమాసాన్ని చాలా మంది శూన్యమాసం అంటారు. కానీ ఈ నెలలో అనేక పండుగలు వస్తుంటాయి. ముఖ్యంగా పూరీ జగన్నాథుడి రథయాత్ర, తొలి ఏకాదశి పండగలు వస్తుంటాయి. అంతేకాకుండా.. ఈ మాసంలోనే మహిళలు బోనాలను జరుపుకుంటారు. అదే విధంగా ఆషాడంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని చెబుతుంటారు. దీనికి గుర్తుగా బోనాల పండుగను వేడుకగా జరుపుకుంటారు.
తమ ఇంట్లో సంప్రదాయంను బట్టి బోనాల పండుగ వైభవంగా జరుపుకుంటారు. అంతేకాకుండా..బోనం అంటే.. భోజనం అని అర్థం. అమ్మవారికి కుండలలో అన్నం వండి , దాని మీద మరో కుండ మీద దీపం పెడుతారు. దాన్ని అమ్మవారి గుడిలోకి తీసుకెళ్లి సమర్పిస్తారు. ఈ క్రమంలో ఆషాడంలో మహిళలు ఎక్కువగా గోరింటాకులు పెట్టుకుంటారు. దీని వెనుక ఉన్న ఒక పురాణ గాథ కూడా ఉంది.
ఒక సారి పర్వత రాజు కూతురు గౌరీ దేవీ తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్తుందంట. అప్పుడు గౌరీ రజస్వల అవుతుందంట. అప్పుడు గౌరీ రక్తం భూమి మీద పడుతుందంట. దాంతో ఒక చెట్టు భూమి నుంచి పెరుగుతుంది. ఈ విషయం కాస్త పర్వత రాజుకు తెలుస్తోంది. ఆయన గౌరీ దేవీ దగ్గరకు వెళ్లి ఇంటికి తెచ్చుకుంటారంట.
అప్పుడు.. పర్వత రాజు.. ఆచెట్టు దగ్గరకు వెళ్లి ఆకుల్ని తెంపుతాడంట. అది ఎర్రగా మారుతుందంట. ఆషాడంలో గౌరీ రజస్వల అయ్యిందని చెప్తుంటారు. అప్పటి నుంచి కూడా ఆ చెట్టును గోరింటాకు అని పిలిచి శివుడు ఒక వరమిస్తారంట. ఎవరైతే మహిళలు ఆషాడంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుంటారో, వారికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందని చెబుతుంటారు. కొంత కాలానికి గోరింటాకు చెట్టు తనను ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకోవాలని పార్వతికి కోరిందంట.
అప్పటి నుంచి ప్రతి ఏడాది మహిళలు తప్పకుండా ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటారని వరం ఇచ్చిందంట. దాన్ని ప్రకారమే ఇప్పటికి కూడా మహిళలు ఆషాడం వచ్చిందంటే చాలు.. పొలాలు,అడవులకు వెళ్లి మరీ గోరింటాకు ఆకుల్ని తెచ్చుకుని, పేస్టులాగా చేసి మెహందీలా చేసుకుని తమ చేతికి పెట్టుకుంటారు. మెహందీ వల్ల మహిళల గర్భస్థ సమస్యలు కూడా దూరమైపోయాని చెబుతుంటారు.
కొందరు మహిళలు ఉష్ణో సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి గోరింటాకు ఉపశమనం కల్గిస్తుందంట. వర్షాకాలంలో అనేక సూక్ష్మజీవులు తరచుగా ఆరోగ్య సమస్యలు కల్గిస్తుంటాయి. గోరింటాకు పెట్టుకొవడం వల్ల మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుందని,ఇమ్యునిటీని కూడా పెంచుతుందని కూడా నిపుణులు చెప్తుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)