Naga Chaitanya Sobhita: నాగ చైతన్య-శోభిత జాతకం.. మంచు విష్ణు ఫోన్‌తో వేణు స్వామి షాకింగ్ నిర్ణయం..!

Mon, 12 Aug 2024-6:05 pm,

గతంలో సమంత, నాగ చైతన్య వైవాహిక జీవితంపై తాను చెప్పినందునే.. ఇప్పుడు చైతూ-శోభిత జీవితాలపై జోస్యం చెప్పాల్సి వచ్చిందన్నారు వేణు స్వామి.   

సెలబ్రిటీల జాతకాలను చెప్పనని గతంలో తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు తనకు ఫోన్ చేస్తే.. వివరాలు ఇచ్చానని చెప్పారు.  

"నా మాటకు ఇంకా నేను కట్టుబడే ఉన్నాను. అప్పుడు నాగచైతన్య-సమంత జ్యోతిష్యం చెప్పాను. దానికి పొడగింపుగా మొన్న నాగచైతన్య-శోభితల భవిష్యత్తు చెప్పాల్సి వచ్చింది. నేను సెలెబ్రెటీల జ్యోతిష్యం జోలికి పోను...మీరు కూడా నా నుంచి అది ఆశించొద్దు." అని వీడియోను రిలీజ్ చేశారు.  

సెలబ్రిటీల జాతకాలు,రాజకీయ  విశ్లేషణలు చేయనని తాను రెండు నెలల కిందట తాను ఓ వీడియో పెట్టానని.. ఆ మాట ప్రకారమే ఉంటానని అన్నారు.  

తాను చెప్పినట్లే నాగ చైతన్య-సమంత విషయం జరిగింది కాబట్టి.. ఇప్పుడు నాగ చైతన్య-శోభిత జాతకం చెప్పాల్సి వచ్చిందన్నారు.  

తనతో ఇప్పుడే మంచు విష్ణు క్లారిఫికేషన్ అడిగారని అన్నారు. తాను ఇక నుంచి సెలబ్రిటీల జాతకాలు, రాజకీయ విశ్లేషణలు, ఎవరి వ్యక్తిగత జ్యోతిష్యం చెప్పే అవకాశం లేదన్నారు.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link