Worlds Most Costly Resort: ప్రపంచంలోనే ఖరీదైన రిసార్ట్.. ఒక్కరాత్రికి రూ. 1 కోటికిపైగా చార్జ్
Atlantis The Royal Resort: అయితే ఈ రిసార్డ్ మొత్తంలోనే అత్యంత ఖరీదైన రూమ్ ఏదైనా ఉందా అంటే.. అది రాయల్ మేన్షన్ రూమ్ అంటారు. ఈ రూమ్ లో ఒక్క రాత్రి స్టే చేయాలంటే ఏకంగా 1 లక్ష డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. అంటే.. మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ. 82.5 లక్షల రూపాయలన్నమాట. ( Photo Credit: Twitter)
Atlantis The Royal Resort: రూ. 82.5 లక్షలతో సరిపోయిందనుకుంటే పొరపాటే.. ఎందుకంటే, ఆపై 22 శాతం పన్ను కూడా ఉంది. అంత పెద్ద మొత్తానికి అదనంగా మరో 22 శాతం టాక్స్ చెల్లించాలంటే దానికి ఎంత అవుతుందో తెలుసా.. రూ. 18 లక్షల 15 వేల రూపాయలు. చార్జ్ ప్లస్ టాక్స్.. రెండూ కలిపితే మొత్తం 1 కోటి 65 వేల రూపాయలు అవుతోందన్నమాట. చూశారా.. నమ్మలేకపోతున్నాం కదా. అందుకే కొన్ని నిజాలు కళ్లతో చూస్తే కాని నమ్మలేం అని చెప్పింది. ఇంకొన్నిసార్లు కళ్లతో చూసినా నమ్మలేం. అది ఇలాంటిదే అనుకోవచ్చు. ( Photo Credit: Twitter)
Atlantis The Royal Resort : అట్లాంటిస్ ది రాయల్ రిసార్టులో అత్యంత చౌక అయిన రూమ్ అద్దె విషయానికొస్తే.. ఇక్కడ ఒక నైట్ స్టే చేయాలంటే కనీసం 4,134 దీరమ్స్ చెల్లించాలి. ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ. 92 వేలు. ఇక ఈ రిసార్టులో మిడ్ రేంజ్ రూమ్ అంటే కనీసం 36,000 అమెరికన్ డాలర్లు చిలుం వదిలించుకోవాలి. ఇండియన్ కరెన్సీలో ఇది రూ. 30 లక్షలకు సమానం. ( Photo Credit: Twitter)
Atlantis The Royal Resort: అట్లాంటిస్ ది రాయల్ రిసార్టులో గదులు ఎందుకంత ఖరీదు ? ఎందుకంటే.. ఈ రిసార్టులో టాప్ టూ బాటం.. ఎటుచూసినా సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా.. అడుగడుగునా లగ్జరీ తప్ప మరేం కనిపించదు. అతి పెద్ద ఇన్-బిల్ట్ జెల్లీ ఫిష్ అక్వేరియం. గదుల్లో, లాబీల్లో గోడలపై బంగారం పూత, బాత్రూమ్స్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ వంటివి ఉపయోగించారు. ( Photo Credit: Twitter)
Atlantis The Royal Resort: ఈ అల్ట్రా లగ్జరీ రిసార్టులో సెలబ్రిటీలు నిర్వహిస్తున్న 17 రెస్టారెంట్స్, బార్స్ కలవు. ఇవి ఈ రిసార్టుకి వచ్చే కాస్ట్‌లీ మందుబాబులకు కనిపించే మరో స్పెషల్ ఎట్రాక్షన్. ( Photo Credit: Twitter)
ఇది కూడా చదవండి : Home Loan EMIs: ఈ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్
ఇది కూడా చదవండి : Goat Milk Ice Cream: మేక పాలతో ఐస్ క్రీమ్.. రోజుకు రూ. 10 లక్షలు సంపాదన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook