Avika Gor Love Story: ప్రియుడ్ని పరిచయం చేసిన అవికా గోర్.. జంట ఫొటోలు వైరల్

Thu, 12 Nov 2020-11:09 am,

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు పరిచయమైన నటి అవికా గోర్ (Aviga Gor) ఓ ముఖ్య విషయాన్ని తెలిపారు. తన ప్రియుడిని పరిచయం చేస్తూ ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది అవికా గోర్. గత కొంతంకాలం నుంచి మిలింద్ చద్వానీ, తాను ప్రేమలో ఉన్నామని తెలిపింది. మిలింద్ చద్వానీతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది అవికా గోర్. ఈ ఫొటోలు (Avika Gor and Milind Chandwani Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘నా పూజలు ఫలించాయి. నా ప్రార్థనలకు సమాధానం వచ్చింది. నా లైఫ్‌లో ప్రేమను సాధించాను. మనల్ని అర్థం చేసుకుని, స్ఫూర్తినింపి, మనం ముందుకెళ్లడంలో తోడ్పాడు అందించాలి. ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిగా రాబోతున్నాడు. అలాంటి వ్యక్తులు దొరకరు అని భావిస్తున్నాంటాం. నాకు సాధ్యమైంది. ఇదంతా ఓ కలలా ఉంది. మీకు కూడా ఇలాంటి మంచి జీవిత భాగస్వామి దొరకాలని ప్రార్థిస్తానని’ నటి అవికా గోర్ తన పోస్టులో పేర్కొంది.

IPL 2020 Funny Memes: వైరల్ అవుతున్న ఐపీఎల్ 2020 ఫన్నీ మీమ్స్

బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ నటి తేజస్విని, మిలింద్ చద్వానీ స్నేహితులు అని తెలిసిందే. గతంలో సోషల్ మీడియాలో మిలింద్ ఈ ఫొటోను షేర్ చేశాడు.

ఈ ఫొటోలను అవికా గోర్, మిలింద్ చద్వానీ ఇన్‌స్టాగ్రామ్ నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం. (All Images Credit: Instagram)   

Delete These Dangerous Apps: ఈ 7 డేంజరస్ యాప్స్‌‌ను తక్షణమే Delete చేయండి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link