Bone Health: వీటిని తింటున్నారా.. మీ ఎముకలలో గుజ్జు పరార్..!

Mon, 09 Sep 2024-11:07 pm,

సాధారణంగా మనిషి ఎముకలు బలంగా, దృఢంగా ఉంటేనే మనిషి ఏ పనైనా సరే సులభంగా, వేగంగా చేయగలరు. కానీ అవే ఎముకలు బలహీనంగా మారిపోతే,  ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఎముకలు పెలుసుగా మారిపోతాయో అప్పుడు త్వరగా విరిగిపోతాయి. అందుకే ఎముకలు దృఢంగా ఉండడానికి కొన్ని రకాల ప్రత్యేకమైన ఆహారాలు తింటూ ఉంటారు. 

ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే కాల్షియం, విటమిన్ డి ఉన్న ఆహారాలను మనం మన ఆహారంలో చేర్చుకోవాలి. అదే సమయంలో ఎముకల నుండి కాల్షియం గ్రహించే ఆహారాలను నివారించడం కూడా అంతే ముఖ్యం. ఎముకలను బలహీనపరిచే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు చూద్దాం. 

మనం తినే ఆహారం ఏదైనా సరే రుచిగా ఉండాలి అంటే ఉప్పు జోడించాల్సిందే. కానీ అదే ఉప్పు ఎక్కువైతే విషపూరితమవుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడి,  బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఉండే సోడియం, ఎముకల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపడంతో ఎముకలు బలహీనపడతాయి.

సోడా పానీయాలు.. కృత్రిమ శీతల పానీయాలు అలాగే సోడా డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా విరిగిపోతాయి. ఇందులో ఉండే ఫాస్ఫరస్, క్యాల్షియం ను గ్రహించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ఎముకలు త్వరగా విరిగే ప్రమాదం ఉంటుంది. చక్కెర అధికంగా ఉండే స్వీట్ లు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే షుగర్ ఎక్కువగా తింటే ఎముకల నుంచి కాల్షియం తగ్గి.. బలహీనంగా మారుతాయి. 

అలాగే కాఫీ, టీ మరియు కొన్ని పానీయాలలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. క్యాల్షియం గ్రహించే శరీర సామర్థ్యాన్ని కెఫిన్ ప్రభావితం చేస్తుంది. కాబట్టి కాఫీ , టీ లకి కూడా దూరంగా ఉండటం మంచిది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండడం మంచిది. బర్గర్ , పిజ్జా తో పాటు ఇతర ఫాస్ట్ ఫుడ్ ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా పెళుసుబారిపోతాయి. ఇది ఎముకలు సులభంగా విరగడానికి దోహదపడతాయి కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోకూడదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link