Unstoppable: బాలకృష్ణ సంచలనం.. అన్‌స్టాపబుల్‌లో వైఎస్‌ షర్మిల, విజయమ్మ?

Tue, 22 Oct 2024-9:03 pm,

అన్‌స్టాపబుల్‌ షోలో నాలుగో ఎపిసోడ్‌ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది. నందమూరి బాలకృష్ణ ఈసారి సంచలన ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యారని సమాచారం.

నాలుగో ఎపిసోడ్ ను రికార్డులు తిరగరాసేలా ఊహించని అతిథులను తీసుకురాబోతున్నారని సమాచారం. అతిథుల జాబితాలో పెద్ద పెద్ద ప్రముఖులే ఉన్నారు.

ఇంటర్వ్యూల జాబితాలో ఏపీకి చెందిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతోపాటు ఆమె మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మ కూడా ఉన్నారనే వార్త చక్కర్లు కొడుతోంది.

ఆంధ్రప్రదేశ్‌తో వైఎస్‌ కుటుంబానిది విడదీయరాని బంధం. రాజకీయంగా కీలకమైన వీరిద్దరితో ఇంటర్వ్యూ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

తెలుగు రాజకీయాలతో ముడిపడిన వీరిద్దరితో బాలకృష్ణ హాట్‌ హాట్‌ ప్రశ్నలతో అడిగి షో రేట్లు పెంచేయాలని ప్లాన్‌ వేసినట్లు సమాచారం.

ఇప్పటికే తన బావ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడతో మరోసారి ఇంటర్వ్యూ చేసి బాలకృష్ణ షోపై భారీ అంచనాలు పెంచేశారు. తాజాగా షర్మిల, విజయమ్మతో ఈ షోను మరింత హై లెవల్‌కు తీసుకెళ్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

వైఎస్సార్‌ మరణం నుంచి ఏపీ ఎన్నికలు.. కాంగ్రెస్‌లో చేరిక.. జగన్‌తో విబేధాలు, వైఎస్‌ వివేక మరణం వంటి ఇలా వైఎస్‌ కుటుంబానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తారనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

రాజకీయంగా వైఎస్‌ కుటుంబంలో ఏం జరిగిందనేది ఎవరికీ తెలియని విషయాలు ఈ షో ద్వారా రాబట్టాలని నిర్వాహకులు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

షర్మిల, విజయమ్మ అనస్టాపబుల్‌ షోలో వస్తున్నది రానిది ఇంకా తెలియలేదు. కొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రచారం జరుగుతున్నట్టు ఒకవేళ ఈ షోలో వారిద్దరూ వస్తే మాత్రం వ్యూస్‌ మాత్రం సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం లేకపోలేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link