Unstoppable with NBk: బాలకృష్ణ షో కి రామ్ చరణ్.. డాకూ మహారాజ్ తో అలరించనున్న గేమ్ చేంజర్
2025 సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు సిద్ధమైన సంగతి తెలిసిందే. అందులో ఒకటి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం కాగా.. మరో రెండు రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకూ మహారాజ్.
బాలకృష్ణ, రామ్ చరణ్ ఇద్దరు సినిమాల పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలు కేవలం రెండు రోజుల గ్యాప్ తో విడుదల కానున్నాయి. సినిమాల విషయం పక్కన పడితే ప్రస్తుతం బాలకృష్ణ బుల్లితెరపై.. తన అన్ స్టాపబుల్ షో తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తన సినిమా కూడా సంక్రాంతికి విడుదలవుతున్నప్పటికీ.. మిగతా హీరోల సినిమా ప్రమోషన్స్ కి కూడా తన అన్ స్టాపబుల్ వేదికను షేర్ చేస్తున్నారు బాలయ్య.
ఇందులో భాగంగా ఈ మధ్యనే వెంకటేష్ ని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ డాకూ మహారాజ్ అలానే సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాల ప్రమోషన్స్ జరిగాయి.
ఇక ఎప్పుడు మరో సంక్రాంతి సినిమా ప్రమోషన్ సైతం మొదలుపెట్టారు బాలకృష్ణ. అది మరేదో కాదు రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఇందులో భాగంగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చారు.
ఈ ఎపిసోడ్ షూటింగ్ కొద్ది గంటల క్రితమే మొదలైంది. ఈ క్రమంలో రామ్ చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ.. అటు.. నందమూరి అభిమానులను ఇటు మెగా అభిమానులను అలరిస్తున్నాయి.