Beauty Tips: మెరిసే పెదవుల కోసం ఈ చిట్కాలు.. ఇవి పాటిస్తే లిప్‌స్టిక్ పక్కన పడేస్తారు
Natural Tips For Lips: పెదవులపై ప్రత్యేక శ్రద్ధ వహించే మహిళలు సహజసిద్ధంగా మీ పెదవులు మెరిసేందుకు ఈ చిట్కాలు అందిస్తున్నాం.
Natural Tips For Lips: టిష్యూ పేపర్ లేదా మృదువైన టూత్‌బ్రష్ తీసుకోండి. వాటితో పెదవులను కొద్దిసేపు మెత్తగా రుద్దండి. చివరకు కొబ్బరినూనె రాయడం మరువవద్దు. దీనివలన పొడిబారిన పొర తగ్గుతుంది. పెదవులపై దుమ్ము వెళ్లిపోయి అందంగా కనిపిస్తాయి. ఇలా చేయడంతో పెదవులకు రక్త ప్రసరణ పెరుగుతుంది. అయితే ఈ పని రాత్రిపూట చేస్తే మేలు.
Natural Tips For Lips: కలబంద రసంలో కొంత తేనే కలిపి పెదవులకు రుద్దాలి. పెదవులకు రాసిన 15 నిమిషాలు తర్వాత కడుక్కోవాలి. దీనివలన పెదవులు పొడిబారకుండా మృదువుగా తయారవుతాయి.
Natural Tips For Lips: పెదవులు పొడిబారకుండా నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. పెదవులు పొడిబారకుండా.. రంగు మారకుండా తాగునీరు దోహదం చేస్తాయి.
Natural Tips For Lips: బీట్ రసాన్ని కొద్దిసేపు పెదవులపై రాయాలి. చేతులతో బీట్ రసాన్ని రాసుకుని కొద్దిసేపు అలానే ఉంచాలి. 15 నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయాలి. ఇలా చేస్తే సహజసిద్ధంగా గులాబీ రంగులో ఉండడంతో పాటు మృదువుగా అవుతాయి.
Natural Tips For Lips: ఆల్మండ్ ఆయిల్, తేనె, చక్కెర ఒక్కో చెంచా తీసుకుని గిన్నెలో కలపాలి. కలిపిన మిశ్రమాన్ని చేతిలో పెదవులపై పూయాలి. మృతకణాలను ఇది తొలగిస్తుంది. పెదవులు నల్లగా కావడం తగ్గుతుంది.