Amul Franchise Investment: అమూల్ ఫ్రాంఛైజీతో భారీ లాభాలు.. 2 లక్షల పెట్టుబడితో నెలకు రూ. 5 లక్షల వరకు లాభం

Wed, 04 Jan 2023-10:05 pm,

చాలామందికి బిజినెస్ చేయాలనే కోరిక ఉంటుంది కానీ ఏం చేయాలో అర్థం కాదు. ఇంకొంత మందికి కొద్దిపాటి పెట్టుబడి ఉంటుంది కానీ ఆ పెట్టుబడితో ఏం చేయాలో తెలియదు. చేయబోయే వ్యాపారం సంగతి ఎలా ఉన్నా.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తెచ్చే వ్యాపారం అయితేనే అన్నివిధాల బాగుంటుంది అనేది అందరికి సర్వసాధారణంగా ఉండే ఆలోచన. 

అమూల్ ఫ్రాంచైజీని తీసుకోవాలని భావించే వారికి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టయితే.. వారు అమూల్ ఫ్రాంచైజీ ఏర్పాటుకు అవసరమైన రుణం తీసుకోవడానికి అమూల్ సంస్థ యాజమాన్యం వారికి సహకరిస్తుంది. 

అమూల్ అవుట్‌లెట్‌ ఏర్పాటు కోసం అమూల్ నిబంధనలకు లోబడి ఒక స్టోర్ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అమూల్ ఫ్రాంచైజీ కోసం ఎంచుకున్న స్టోర్ ఏరియా 100 లేదా 300 చదరపు అడుగుల వైశాల్యంలో ఉండాలి. భారీ సంఖ్యలో అపార్ట్‌మెంట్స్, సొసైటీలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ హబ్‌లు, మాల్స్, ఆసుపత్రులు లేదా రద్దీగా ఉండే ఇతర బహిరంగ ప్రదేశాలు అమూల్ ఫ్రాంచైజీ బిజినెస్ క్లిక్ అవడానికి అనువుగా ఉంటాయి.

అమూల్ ఫ్రాంచైజీని ఓపెన్ చేయడానికి అయ్యే ఖర్చును పరిశీలిస్తే.. మిల్క్ స్టాక్ రావడం కోసం మీరు కనీసం రూ. 25,000 అమూల్ ఇచ్చిన సంబంధిత బిజినెస్ ఎకౌంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదనంగా, దుకాణంలో వ్యాపార నిర్వహణకు అవసరమైన ఎక్విప్‌మెంట్, డెకరేషన్ కోసం దాదాపు రూ. 1.5 లక్షలు వరకు ఖర్చు అవుతుంది అనుకున్నా.. సుమారు రూ. 2 లక్షల్లో వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.  

అమూల్ రిటైల్ ఫ్రాంచైజీ నిర్వహించే వారికి ఉన్న గిరాకీని బట్టి నెలకు సుమారు రూ. 5 లక్షల నుంచి ఒక్కోసారి 10 లక్షల వరకు ఆదాయం ఉంటుంది.

మరింత పూర్తి సమాచారం కోసం అమూల్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ www.amul.com లోకి లాగిన్ అవండి.

అమూల్ ఫ్రాంచైజ్ బిజినెస్ ఆపర్చునిటీ అనే బటన్‌పై క్లిక్ చేయండి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link