Best Smart TV with Low Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 108 సెంటీమీటర్ల Mi X Series టీవీ రూ. 10,999లోపే..బ్యాంక్‌ ఆఫర్స్‌తో మరింత తగ్గింపు!

Sun, 03 Sep 2023-1:27 pm,

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా Mi X Series 108 cmపై ప్రత్యేక తగ్గింపుతో పాటు బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ నాలుగు వేరియంట్స్‌లో లభిస్తోంది. 

ఆఫర్స్‌కు ముందు ఫ్లిప్‌కార్ట్‌ ఈ Mi X Series 43 inch స్మార్ట్‌ టీవీని రూ.42,999లకు విక్రయించింది. ఈ బిగ్‌ బచాత్‌ సేల్‌లో భాగంగా 32 శాతం తగ్గింపుతో రూ. 28,999లకే అందిస్తోంది. దీంతో పాటు అదపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  

ఫ్లిఫ్‌కార్ట్‌ Mi X Series 43 inch స్మార్ట్‌టీవీపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్ట్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే..రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ కార్డ్‌పై EMI ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకు తగ్గింపు లభిస్తుంది.  

ఈ Mi X Series 43 inch స్మార్ట్‌ టీవీ అన్ని బ్యాంక్‌ ఆఫర్స్‌ పోను రూ. 26,999లకే పొందవచ్చు. ఇక ఈ టీవీపై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్‌ టీవీని ఎక్చేంజ్‌ చేసి కొనుగోలు చేస్తే రూ. 16,900 వరకు తగ్గింపు లభిస్తుంది. అన్ని ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌టీవీని రూ.10,099లకే పొందవచ్చు.   

కంపెనీ మొట్ట మొదటి సారిగా 2019లో X సిరీస్‌ను మార్కెట్‌లోకి విడుదలు చేసింది. ఇది L43M8-A2IN మోడల్‌ పేరుతో కంపెనీ మార్కెట్‌లో విక్రయిస్తోంది. ఈ Mi X Series 43 inch స్మార్ట్ టీవీ Ultra HD (4K)ల డిస్ప్లేను కలిగి ఉంటుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link