Earphones Under Rs 5000 : ఇయర్ ఫోన్ కోంటున్నారా? ధరలు చెక్ చేయండి!

Mon, 07 Dec 2020-12:11 am,

మీరు వన్‌ప్లస్ బడ్స్ కొనుగోలు చేయవచ్చు.కంట్రోల్స్‌ను కస్టమైజ్ చేయాలి అనుకుంటే మీకు వన్‌ప్లస్ ఇయర్‌ఫోన్స్ అవసరం లేదు. దీని కోసం అఫీషియల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీకు రూ.4,999 కు లభిస్తుంది. దీన్ని మీరు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ బడ్స్‌లో 13.4 మిమి డైనామిక్ డ్రైవర్ ఉంటుంది. డాల్బీ ఎట్మోస్‌తో 3డీ స్టీరియో కూడా లభిస్తుంది.30 గంటల బ్యాటరీని 10 నిమిషాలు చార్జ్ చేస్తే 10 గంటలు వస్తుంది. ఇందులో ANC లేదు దాంతో పాటు environmental noise cancellation పపోర్ట్ లభిస్తుంది. ఇది low-latency మోడ్ వల్ల మంచి గేమింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు.  వన్‌ప్లస్ బడ్స్ IPX4 రేటింగ్ పొందింది.

Oppo Enco W51 ను మీరు రూ.4,999 కు సొంతం చేసుకోవచ్చు. ఇందులో యాక్టివ్ నాయిజ్ కేన్సిలేషన్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇది 35dB వరకు నాయిజ్‌ను కూడా తగ్గిస్తుంది అని కంపెనీ చెబుతోంది. ఇందులో 7 మిమి డైనామిక్ డ్రైవర్ IP54 రేటెడ్ , క్యూఇ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. దీనర్థం ఏంటంటే దీన్ని చార్జ్ చేయడానికి ఏ చార్జింగ్ మ్యాట్ లేడా ప్యాడ్‌ను అయినా వాడుకోవచ్చు. ANCయాక్టివ్ అవడంతో ఇయర్‌ఫోన్ 3.5  గంటల వరకు నడుస్తుంది. మామూలుగా అయితే 20 గంటల చార్జింగ్ ఉంటుంది.

Xiaomi Mi True Wireless ఇయర్‌ఫోన్ ధర రూ.3,999 ఇందులో ఇయర్‌పాడ్స్ లాంటి డిజైన్ అంటే చెవిలో ఫిట్ అయ్యే డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మీకు 14.2 మిమి డ్రైవర్ బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో పాటు ఎస్‌బీసి, ఏఏసి, ఎల్‌హెచ్‌డిసి బ్లూటూత్ కోడెక్ చేసి ఉంటుంది. 

షోర్ షాట్స్ X5 ప్రో ఒకసారి చార్జ్ అయితే 8 గంటల వరకు బ్యాటరీ లైఫ్ సపోర్ట్ ఇస్తుంది. ఈ ఆడియో ప్రోడక్ట్స్‌లో బెటర్ సౌండ్ క్వాలిటీ కోసం క్వాల్‌కామ్ చిప్‌సెట్ ఉంటుంది. ఇందులో  AptX + AAC హైఫై ఆడియో టెక్నిక్ ఉంటుంది. దీంతో పాటు ఇందులో మీకు IPX7 రేటింగ్ కూడా లభిస్తుంది. కెమ్‌ మేలో 2,200mAh బ్యాటరీ లభిస్తుంది.  

Realme Buds Air Pro కరంట్లీ రూ.4,999 లో ఈకామర్స్ సైట్‌లో లిస్టెడ్ చేశారు. ఇక్కడ మీకు యాక్టివ్ నాయిస్ కేన్సిలేషన్ ( ANC) తో పాటు ఇది లభిస్తుంది. ఇంత తక్కువ ధరతో లభించే మరో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్ లేదు. ఇది 35dB వరకు నాయిజ్‌ను కూడా తగ్గిస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link