Bhumika: భర్తతో భూమిక విడాకులు.?.. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ఆ హీరో ఎవరో తెలుసా..?
నటి భూమిక టాలీవుడ్ లో తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. మెయిన్ గా.. ఖుషీ సినిమాతో భూమికకు.. ఎక్కడ లేని స్టార్ డమ్ వచ్చి పడిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఆమె సింహాద్రి, ఒక్కడు, వాసు, సత్య భామ వంటి సినిమాల్లో నటించి, అందర్ని ఫిదా చేసింది.
మరోవైపు ఈ భామ.. యువకుడు అనే చిత్రంద్వారా తెరంగేట్రం చేసింది. టాలీవుడ్ లో వరుసగా సినిమాలు తీస్తు ముందుకు దూసుకుపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగిందని చెప్పుకొవచ్చు.
ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ తన నడుమును చూశాడని చెప్పిన ఆ డైలాగ్ ఇప్పటికి ఎవర్ గ్రీన్ అని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. ఈ భామ.. తన యోగా ట్రైనర్ అయిన.. భరత్ ఠాగుర్ ను లవ్ చేసింది. ఇద్దరు కూడా కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసుకున్నాక.. పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.
తొలుత భూమిక ఇంట్లో ఈ పెళ్లి వద్దన్నారని, కానీ భూమిక మాత్రం వెనక్కు తగ్గకపోవడంతో వీరి ఫ్యామిలీ పెళ్లికి ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. 2007 అక్టోబర్ 21 న భూమికకు పెళ్లి జరిగినట్లు సమాచారం.
ప్రస్తుతం మాత్రం భూమిక పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీలైఫ్ లో బిజీగా ఉంటున్నారు. అప్పుడప్పుడు కొన్నిసినిమాల్లో కన్పించిన కూడా.. తన ఫ్యామిలీకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల భూమికకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
భూమికకు, ఆమె భర్త భరత్ ఠాగుర్ కు అస్సలు పడట్లేదని, ఇద్దరు గొడవలు పడుతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. అంతే కాకుండా.. రెండు వైపులా కుటుంబాలు కూర్చుని మాట్లాడుకుంటున్న కూడా గొడవలు ఆగడంలేదన్నారు.
ఆమె బలవంతంగా మీదనే పెళ్లి జరగడంతో.. భూమికి ఫ్యామీలీ సైతం సపోర్ట్ గా ఉంటున్నారని వార్తలు వైరల్ గా మారాయి. అయితే.. దీనిలో ఎంత నిజం ఉందో మాత్రం తెలియాల్సి ఉంది. ఇటీవల ఇలాంటి రూమర్స్ మాత్రం తరచుగా వైరల్ అవుతున్నాయి.
కొంత మంది నెటిజన్ లు పనిగట్టుకుని, ఫెమస్ పర్సనాలిటీస్, నటీ, నటుల వ్యక్తిగత జీవితాలపై ట్రోలింగ్ లకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని మాత్రం ట్రోలింగ్ , రూమర్స్ బాధితులు గట్టిగానే తిప్పికొడుతున్నారు. అయిన కూడా ఈ రూమర్స్ మాత్రం ప్రస్తుతం తలనొప్పిగా మారాయని చెప్పుకొవచ్చు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)