School Timings: స్కూల్‌ పిల్లలకు బిగ్‌ అలర్ట్‌.. పాఠశాల సమయాల్లో భారీ మార్పు

Wed, 18 Dec 2024-6:38 pm,

కనిష్ట స్థాయి: చలికాలంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అత్యల్ప ఉష్ణోగ్రతలు: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు.

అటవీ ప్రాంతాలు: హైదరాబాద్‌తో సహా అటవీ ప్రాంత జిల్లాలైన కుమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలు వణికిపోతున్నాయి.

చలి తీవ్రత: ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాఠశాలల సమయవేళల్లో భారీగా మార్పులు వచ్చాయి.

పని వేళలు: ప్రైమరీ స్కూల్, హై స్కూల్ పని వేళల్లో మార్పులు చేస్తూ ఆదిలాబాద్‌ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మారిన సమయం: ఉదయం 9.40 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పాఠశాల పని వేళలు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆదేశాలు జారీ: పాఠశాలల సమయవేళల్లో మార్పులు చేస్తూ అదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

జాగ్రత్తలు: చలి తీవ్రత అధికంగా ఉండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ సూచించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link