Bigg Boss Telugu 4: Sohel రూ.25 లక్షలు తీసుకుని ఎలిమినేట్! కథ వేరేనే ఉందా?
Bigg Boss Telugu 4 Winner: గత కొన్ని రోజుల నుంచి భారీ సంఖ్యలో నెటిజన్లు భావించినట్లుగా అభిజిత్ బిగ్‌బాస్ తెలుగు 4 టైటిల్ విన్నర్ అయ్యాడని, అఖిల్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. (Photos: Twitter)
Also Read: Lakshmi Manchu Daughter Vidya Nirvana: మంచు లక్ష్మి కుమార్తె అరుదైన ఘనత
వాస్తవానికి Bigg Boss Telugu 4 నుంచి ఎలిమినేట్ అయిన హౌస్‌మేట్స్ తిరిగి రీయూనియన్‌లో భాగంగా ఇంటికి రావడం టర్నింగ్ పాయింట్ అయిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
దివి, మెహబూబ్ జంటగా బిగ్‌బాస్ 4 హౌస్‌లోకి ఇటీవల ఎపిసోడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సందర్భంగా తన క్లోజ్ ఫ్రెండ్ సోహైల్‌ను పైసలు తీసుకోమంటూ మెహబూబ్ సిగ్నల్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాను కచ్చితంగా బిగ్ బాస్ తెలుగు 4 విజేతనయ్యే అవకాశం లేదని భావించిన సోహైల్ రూ.25 లక్షలతో హౌస్ నుంచి నిజంగానే ఎలిమినేట్ అయ్యాడని కొందరు ఫ్యాన్స్ సైతం ట్వీట్లు చేస్తున్నారు. అన్నా.. ఎంతపని చేశావని కొందరు కామెంట్ చేస్తున్నారు.
మరికొన్ని గంటల్లో విజేత ఎవరు, రన్నరప్ ఎవరన్నది తేలనుంది. ఈ సమయంలో కొన్ని వదంతులు చక్కర్లు కొడుతున్నాయి.