Bigg Boss Vasanthi : వాసంతి.. అందాల చేమంతి.. చీరకట్టుకే అందం తెచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Mon, 17 Apr 2023-8:04 pm,

బిగ్ బాస్ ఇంట్లోకి రాకముందు వాసంతి.. కొన్ని సినిమాలు చేసింది. కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. వాసంతి చివరకు వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో నటించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన వాంటెడ్ పండుగాడ్ సినిమాలో అందంగా కనిపించింది.

వాసంతికి బిగ్ బాస్ ఇంటికి గ్లామర్ డాల్ అనే పేరు వచ్చింది. సోషల్ మీడియాలో వాసంతి అందాలకు అందరూ ఫిదా అయ్యారు.ఒక్కో సీజన్‌కు ఇలా ఒక్కో బ్యూటీ వెలుగులోకి వస్తుంటుంది. దివి, వాసంతిలు బిగ్ బాస్ ఇంట్లో అందాలను చూపించి మెప్పించారు.

బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన వాసంతి బుల్లితెరపై మళ్లీ సందడి చేయడం ప్రారంభించింది. అర్జున్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో ఎక్కువగా మాట్లాడేది కాదు. కానీ బయటకు వచ్చిన తరువాత బీబీ జోడిలో ఈ ఇద్దరూ రొమాంటిక్ పర్ఫామెన్స్‌లతో దుమ్ములేపేశారు.

బిగ్ బాస్ జోడి విన్నర్‌గా వాసంతి, అర్జున్ కళ్యాణ్‌ గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ చివరకు ఫైమా సూర్యలు గెలిచారు. కానీ జనాలు మాత్రం అర్జున్ కళ్యాణ్‌ వాసంతిల పర్ఫామెన్స్‌లకు ఫిదా అయ్యారు.

తాజాగా వాసంతి చీరకట్టులో వెలిగిపోయింది. చీరకట్టులో వాసంతి అందాల చేమంతిలా ఉందని కామెంట్లు పెడుతున్నారు. వాసంతి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link