Malaika father Suicide: స్టార్‌ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. 7వ ఫ్లోర్‌ నుంచి దూకి సూసైడ్‌..

Wed, 11 Sep 2024-1:30 pm,

Actress Malaika father Suicide: బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి మలైకా అరోరా తండ్రి అనిల్‌ అరోరా ఈరోజు ఉదయం భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో వారు ఉంటున్న ఇంటి టెర్రాస్‌ పైనుంచి దూకి చనిపోయినట్లు బీటౌన్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఘటన జరిగిన సమయంలో మలైకా ఇంట్లో లేరు. పూనేలో ఉన్న ఆమెకు విషయం తెలుసుకున్న వెంటనే ముంబై బయలుదేరారు.  

అనిల్‌ అరోరాకు మలైకా అరోరా, అమృత అరోరా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇక ఈ ఆత్మహత్యకు గల కారణాలను మలైకా కుటుంబ సభ్యులు ఎవరూ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆత్మహత్య విషయం తెలిసిన పోలీసు అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. కానీ, ఎలాంటి వివరాలను ఇంకా మీడియాకు వెల్లడించలేదు.  

ఆత్మహత్యకు గల కారణాలను మలైకా కుటుంబ సభ్యులను బంధువులను అడిగి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో ప్రకారం మలైకా మాజీ భర్త, యాక్టర్‌, నిర్మాత  అర్భజ్‌ ఖాన్‌ అనిల్‌ అరోరా ఇంటికి చేరుకున్నారు.   

అర్భజ్‌ ఖాన్‌ ఘటన స్థలంలో పోలీసు అధికారులతో మాట్లాడుతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతేకాదు ఘటన జరిగిన అనిల్‌ అరోరా ఇంటి చుట్టూ కూడా పోలీసుల బందోబస్తు పెంచారు. అక్కడ అంబులెన్స్‌ చేరుకున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  

అయితే, గతంలో మలైకా అరోరా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు అనిల్‌ అరోరా, జాయిసి పాలికార్ప్‌ విడాకులు తీసుకున్నప్పుడు తన వయస్సు కేవలం 11 ఏళ్లే అని చెప్పారు. ఇక తన చెల్లి అమృత అరోరా వయస్సు 6 ఏళ్లు. వారిద్దరూ తన తల్లి చేతుల మీదుగానే పెరిగారు. విడాకుల తర్వాత మలైకా తల్లి థానే నుంచి చెంబూర్‌కు కూతుళ్లతోపాటు మకాం మార్చారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link