Brahmamudi: ఆస్తి రాగానే పూర్తిగా మారిపోయిన కావ్య.. నీడలేకుండా పోతుందని స్వప్నకు కూడా సీరియస్ వార్నింగ్.. అసలు విషయం పసిగట్టిన అపర్ణ
ఇప్పటికైనా కళ్లు తెరువు. కావ్య తన సొంతం వాళ్ల అత్తామామ భర్త అని మాత్రమే అనుకుంటుంది. తెలిసిన తప్పు తెలుసుకో మేము నీకు సపోర్ట్ చేస్తాం. నీ చెల్లి గురించి నీకు త్వరగా తెలిసింది. ఇకనైనా మమ్మల్ని నమ్ము అందరం కలిసి మనకు రావాల్సిన ఆస్తి తీసుకుని నచ్చినట్లు బతుకుదాం అంటుంది.
అప్పుడు స్వప్న మిమ్మల్ని ఎలా కొట్టాలని చూస్తున్నా. నాకు నా చెల్లిపై కోపం లేదు. అది నాకన్న వయస్సులో చిన్నది, బాధత్యతలో నా తల్లి. నిజంగా చెక్కు ఇంటి ఖర్చు గురించి ఇచ్చింది.నేనే నెక్లెస్ కొన్నా మధ్యలో మీకెందుకు కాలుతుంది నాకు అర్థం కావడంలేదు. ఎప్పుడు ఇంటిని దోచుకోవాలా అని చూస్తారు. కక్కూర్తి ఉండొచ్చు కానీ, మరీ ఇంతలా ఉండకూడదు ఛీ కొట్టి వెళ్లిపోతుంది స్వప్న. ఇప్పట్లో ఇది బయటకు రాదురా కావ్య మాయ నుంచి ఈ స్వప్న గురించి నాకు తెలుసు ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు దీన్ని పూర్తిగా మార్చేయొచ్చు అంటుంది రుద్రాణీ.
ఇక స్వప్న కావ్య వద్దకు వెళ్తుంది. నీ దృష్టిలో నేను కూడా పరాయిదానిలా కనిపిస్తున్నానా? అని నిలదీస్తుంది. నీకు తెలియకుండా నెక్లెస్ కొంటే అందరూ ముందు బయటపెట్టి అవమానిస్తావా? అంటుంది స్వప్న. సొంత అక్కవు చెల్లెలిగా ఒక మాట అంటే తప్పేంటి. నీ ఫ్యామిలీ వేరు నా ఫ్యామిలీ వేరు అనలేదా? అంటుంది. అక్క లక్షలకు లక్షలు దుబారా చేస్తున్నారు.
నువ్వు గోల్డ్ నెక్లెస్ కొంటే మనల్ని అనరా? అంటుంది కావ్య. ఆస్తి చేతికి వచ్చే సరికి నువ్వు మారిపోయావ్ అంటుంది. దీంతో కావ్య రెచ్చిపోతుంది.. చాలు ఆపు.. నీకు ఏవైనా కావాలంటే నీ భర్తను లేదా నీ ఆస్తి నుంచి ఖర్చు పెట్టుకో జాగ్రత్తగా మసులుకో లేకపోతే ఈ మాత్రం నీడ కూడా లేకుండా పోతుంది. దీంతో బోరున ఏడుస్తుంది స్వప్న. నాకు బాగా అర్థమైంది. ఆస్తులు రాగానే అక్కను కూడా పరాయి దాన్ని చేశావ్. ఇంత దారుణంగా మారావు ఛీ అని ఏడుస్తూ స్వప్న వెళ్లిపోతుంది.
కావ్య కూడా ఏడుస్తుంది. బెడ్‌రూమ్‌లో ప్రకాశంపై విరుచుకుపడుతుంది ధాన్యలక్ష్మి. మొదటి నుంచి మీరు ఇంతే నన్ను మాత్రమే తప్పుగా పడతారు అంటుంది ధాన్యం. ఈరోజు నాకు రుద్రాణీకి జరిగిన అవమానం రేపు నీకు నీ కొడుకుకు కూడా జరుగుతుందని నమ్మకం లేదు అంటుంది. ఈ పిచ్చి అనుమానం నీకు ఎందుకు వచ్చింది అంటాడు ప్రకాశం. డబ్బు విషయంలో సొంత అక్కను లెక్క చేయలేదు మనల్ని ఎందుకు చేస్తుంది. ఆ తర్వాత చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం తప్పదు అంటుంది ధాన్యం.
అబ్బ ఇప్పుడు ఏంటి ఈ విషయంలో అన్నయ్యను ఒక మాట అడగాలి అంతేగా.. అని లేచి వెళ్లిపోతాడు ప్రకాశం. హమ్మయ్య.. ఈయనలో ఇన్నాళ్లకు మార్పు వచ్చింది. అవకాశం చూసి ఈయన్ను పూర్తిగా నావైపు తిప్పుకుంటా అనుకుంటుంది ధాన్యం. ఇక బెడ్‌రూమ్‌లో రాజ్ కావ్యతో స్వప్న విషయమై మాట్లాడుతుంటారు. నువ్వు స్వప్నను అందరి ముందు నిలదీసేది లేకుండే అంటాడు రాజ్.
ఇంటి విషయం నీకు తెలుసు నాకు తెలుసు తనకు తెలీదు కదా.. అంటాడు. అక్క ఫీలవ్వడం తర్వాత కలిసి పోవడం మాములే అంటుంది కావ్య. తను ఇంకా అప్పటి స్వప్నలానే మాట్లాడతుంది అనుకుంటావా? రెండు సార్లు స్వప్నను అంతలా అవమానించావు. నేను ఎందుకు తిట్టాను అంటే సమాధానం చెప్పాల్సి ఉంటుంది చెప్పమంటారా వంద కోట్ల గురించి చెప్పాలంటారా? మా అక్క అందరికీ చెప్పకుండా ఉంటుందా? అందుకే తనని అరిచి బాధపెట్టడమే మంచిదనిపించింది.
ఉదయం అవుతుంది.. రూ. 5 లక్షల కోసం టెన్షన్ పెడటం మొదటిసారి. అపాత్ర దానం చేస్తే దేవుడు ఇలాగా మొట్టికాయలు వేస్తాడు. తాతయ్య ఆసుపత్రి బిల్ కట్టాల్సింది ఇంక చెక్ క్లియరెన్స్‌కు వెళ్తుంది. అప్పుడు అంతా తెలుస్తుంది. అయితే, స్వప్న కొన్న నెక్లెస్ విసిరికొట్టింది కదా దాన్ని అమ్మేద్దాం అంటుంది. వద్దంటాడు రాజ్ ఈ డబ్బు వల్ల నీకు స్వప్నతో విభేదాలు వద్దు అంటాడు రాజ్.
ఇక హాల్‌లో అందరూ ఉంటారు. రాత్రి మీకేం చెప్పామీ అన్నయ్య తో మాట్లాడతా అడుగుతా అన్నారు కదా అని ప్రకాశాన్ని ధాన్యలక్ష్మి లాక్కొస్తుంది. మీకు ధైర్యం సరిపోకపోతే చెప్పండి నేను వెళ్లి గొడవపెద్దది చేస్తా అంటుంది ధాన్యం. నీ కంపు నోరు విప్పడం కంటే నేనే అడుగుతా అంటాడు. అప్పుడే సుభాష్‌కు కాల్ వస్తుంది ఆసుపత్రి బిల్ కట్టలేదు అంటారు. దీంతో ఆసుపత్రి బిల్ ఎందుకు కట్టలేదు ఏదో పెద్ద విషయమే దాస్తున్నారు ఏం జరిగిందని అపర్ణ నిలదీస్తుంది.