Brahmamudi: అసలు విషయం తేల్చేసిన రుద్రాణీ.. అప్పుకు కూడా, మళ్లీ సర్వరోగ నివారిణిలా కావ్య..

Mon, 30 Dec 2024-10:25 am,

ఇక రాజ్‌ తన ఫ్రెండ్‌ శేఖర్‌కు ఫోన్‌ చేస్తాడు. రూ.5 లక్షలు అప్పుగా కావాలి అంటాడు. నీకు ఐదు లక్షలు ఒక్క లెక్కా అంటాడు. కారణాలు అడగకు కానీ, డబ్బు కావాలి అంటాడు. అయితే ఈ మధ్య ఫ్లాట్‌కు డబ్బు కట్టా అంటాడు. వెంటనే నేను నా భార్య పందెం వేసుకున్నాం అంతేరా అని ఫోన్‌ పెట్టేస్తాడు. ఇక కళావతి ఇది మా పుట్టింట అలవాటే అని తన బంగారం తెచ్చి ఇస్తుంది. బ్యాంక్‌లో తాకట్టు పెట్టి డబ్బు కట్టేయండి రాజ్‌కు ఇస్తుంది. అత్తగారు ఇంటికి వచ్చిన కొత్తలో ఇచ్చింది. రాజ్‌ వద్దన్నా ఇస్తుంది.   

ఉదయం ఆసుపత్రిలో కల్యాణ్‌కు అప్పు ఫోన్ చేస్తుంది. నీ దొంగ పలకరింపులు నేను ఫోన్ చేస్తే మాట్లాడుతున్నావ్‌. నువ్వు చాలా మారిపోయావు అంటుంది. అప్పు ఇప్పుడు నేను ఏం చేశాను? అంటాడు. వీకెండ్‌లో నా దగ్గరకు వస్తా అని అప్పుడు చెప్పావు కదా.. అంటుంది..అన్నానా? అంటాడు కల్యాణ్‌. అసలు నీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్‌? అంటాడు కవి. నిజం చెప్పు నువ్వు హైదరాబాద్‌లో చిన్నిళ్లు ఏమైనా మెయింటైన్‌ చేస్తున్నావా? అంటుంది అప్పు. అప్పు ప్లీజ్‌ అంటుంటే.. పక్కన డాక్టర్‌ బిల్‌ కట్టలేదని అడిగిన విషయం అప్పుకు తెలిసిపోతుంది. వెంటనే కల్యాణ్‌ కాల్‌ కట్‌ చేస్తాడు.   

డాక్టర్‌ డబ్బులు కట్టకుండా ట్రీట్మెంట్‌ ఎలా చేస్తారు? అంటాడు. చిన్న పేమెంట్స్‌ కూడా మా అన్నయ్య క్లీయర్‌ చేస్తారు అంటుంటే నర్స్‌ వచ్చి సార్‌.. వాళ్లు బిల్‌ కట్టేశారు అంటుంది. ఇక డాక్టర్‌ సారీ చెప్పి వెళ్లిపోతాడు. అప్పు మళ్లీ కాల్‌ చేస్తుంది నా దగ్గర ఏం దాస్తున్నావ్‌? ఆసుపత్రిలో ఎవరు ఉన్నారు.  

 నిజం చెప్పు, లేకపోతే నామీద ఒట్టు అంటుంది. దీంతో జరిగిందంతా చెప్పేస్తాడు కవి. నాకు వెంటనే టికెట్‌ బుక్‌ చేయి నేను తాతయ్యను చూడాలి. అంటుంది. ఇలా అంటావనే నేను చెప్పలేదు అంటాడు కవి. కానీ, నువ్వు ఇప్పుడు ఒక లక్ష్యంతో వెళ్లావు అంటాడు కావ్య వదిన కూడా ఈ విషయం చెప్పొద్దు అంది అంటాడు.  

ఇక్కడ తాతయ్యకు మేంమందరం ఉన్నాం. అక్కడ నువ్వు ఒక్కదానివే ఆయన కోమాలోనుంచి వచ్చే సరికి నువ్వు పోలీస్‌గా ఆయన ముందు ఉండాలి అంటాడు కవి. పాపం రా బై నిన్ను అర్థం చేసుకోలేదు అంటుంది. తాతయ్య జాగ్రత్త అని ఫోన్‌ కట్‌ చేస్తుంది.  

రాజ్‌ బెడ్‌రూమ్‌లో ఒక లెట్టర్‌ ఓపెన్‌ చేసి చూస్తాడు. చదివి తలపట్టుకుంటాడు. అప్పుడే కావ్య.. ఏవండి కాఫీ తీసుకోండి అంటుంది. మీరేదో ఆలోచిస్తున్నారు అని అర్థం అవుతుంది అంటుంది.ఆ లెట్టర్‌ చేతికి ఇస్తాడు. రెంటెడ్‌ కార్‌ బిల్స్ అంటాడు. మూడు లక్షలు కట్టమని బిల్‌ ఉంది. నాలుగు కార్లకు బిల్‌ అంత అవుతుందా? దేవుడా పరీక్షల మీద పరీక్షలు పెట్టి ఇంతలా ఇబ్బంది పెట్టాలా అంటుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అని కావ్య ఆలోచిస్తుంది.  

అసలు కార్లు లేకపోతే రెంట్‌ కట్టాల్సిన అవసరంలేదు కదా.. అంటుంది కావ్య. ఇలా చేస్తే ఇంట్లో అందరికీ తెలుస్తుంది అంటాడు రాజ్. సర్వరోగనివారిణిలా నేనున్నా కదా నేను సమాధానం చెబుతా అంటుంది కావ్య. చూడండి పంచభక్షపరమాన్నలు లేనప్పుడు పచ్చడి మెతుకులు కూడా తినాలి. నా మాట వినండి ఆఫీస్‌కు ఒక కారు, ఇంట్లో ఒక కారు పెడదాం. కావాలంటే మళ్లి తెచ్చుకుందాం అంటుంది కావ్య.  

ఏంటింట్లో ఎవరూ కనిపించడం లేదు? ఎక్కడ చచ్చారు ఈ గుంపంతా అని రుద్రాణీ ఒక్కతే హాల్‌లో కూర్చుంటుంది. ఏయ్ సంతా అని పిలుస్తుంది. శాంతా అమ్మ అంటుంది. కాఫీ ఇవ్వు అంటుంది రుద్రాణీ. నేను మీ ఓనర్‌తో మాట్లాడా మీ కార్లు తీసుకెళ్లండి అని డ్రైవర్లకు కావ్య చెప్పడం పైనుంచి చూస్తుంది రుద్రాణీ.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link