BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరే ఆఫర్.. రోజుకు రూ.3.50 తో ఏడాది బంపర్‌ ప్లాన్‌, పూర్తి వివరాలు

Sun, 03 Nov 2024-6:29 am,

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ. కస్టమర్లను ఆకట్టుకునేందకు బీఎస్‌ఎన్‌ఎల్‌ అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఏడాది రీఛార్జీ ప్లాన్‌తో కేవలం రోజుకు రూ.3.50 పడుతుంది. ఈ ప్లాన్‌ ధర రూ.1,198 ఉంటుంది.  

బీఎస్‌ఎన్‌ఎల్ ఈ అద్భుతమైన రీఛార్జీ ప్యాక్‌ వ్యాలిడిటీ ఏడాది పాటు వర్తిస్తుంది. మీకు సెకండ్‌ సిమ్‌ ఉంటే ఇది బెస్ట్‌ ప్లాన్‌. నెలకు కేవలం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది అంతే. ఇందులో 300 నిమిషాలు ఫ్రీ కాలింగ్‌ ప్రతినెలా ఉంటుంది. 3 జీబీ హై స్పీడ్‌ డేటా, నెలకు 30 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు.  

బీఎస్‌ఎన్‌ఎల్ మరో 365 రోజుల రీఛార్జీ ప్లాన్‌ పై కూడా భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. రూ.1999 ప్లాన్‌ ప్రస్తుతం రూ.100 తగ్గించి కేవలం రూ.1899 కే అందిస్తోంది. ఈ ప్లాన్ కేవలం నవంబర్‌లో రీఛార్జీ చేసుకుంటేనే వర్తిస్తుంది.  

ఈ ప్లాన్‌లో మీరు 600 జీబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. ప్రైవేటు కంపెనీలు గట్టి పోటీ ఇస్తూ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలాంటి వినూత్నమైన రీఛార్జీ ప్లాన్లను ముందుకు తీసుకు వస్తుంది.   

జూన్‌లో టెలికాం ధరలు పెరిగిన తర్వాత అన్నీ ప్రైవేటు టెలికాం దిగ్గజ కంపెనీలు రీఛార్జీ ప్లాన్ ట్యారీఫ్‌ల ధరలను పెంచేశాయి. కానీ, బీఎస్‌ఎన్‌ఎల్ ధరలు సరసమైనవి అందుకు చాలామంది ఇతర సబ్‌స్కైబర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link