Budget 2021: మీకు ఆదాయం లేకపోయినా సరే ఈ పన్నును చెల్లించక తప్పదు

Sun, 24 Jan 2021-3:11 pm,

కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో కేంద్ర బడ్జెట్ 2021ను ప్రకటించబోతున్నారు.  ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2021(Union Budget 2021 News Updates)ను సమర్పించనుండగా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో ప్రారంభమవుతాయి. దేశంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చెల్లించే 2 రకాల పన్నుల గురించి తెలుసుకోండి.

Also Read: IT Refund Status Check: మీ ఐటీ రిఫండ్ ఇంకా రాలేదా.. కారణమేంటో ఇలా తెలుసుకోండి

ప్రత్యక్ష పన్నులు(Direct Tax) అంటే వ్యక్తిగతంగాగానీ, లేక కంపెనీలు, సంస్థలు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులు. దేశంలో పలు రకాల ప్రత్యక్ష పన్నులున్నాయి. అవి ఆదాయపు పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ ట్యాక్స్, మూలధన లాభం పన్ను. మీరు సంపాదించే వ్యక్తి అయితే ఈ ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తారు.

మీకు ఆదాయం లేకపోయినా చెల్లించాల్సిన పన్నులు ఉంటాయి. వాటిని పరోక్ష పన్నులు అంటారు.  ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST)తో  వస్తువులు, సేవల కోసం ప్రభుత్వం విధిస్తున్న పన్నును పరోక్ష పన్ను అని చెప్పవచ్చు. మీ ఉపాధి, ఆదాయాలు లేదా లాభాలతో సంబంధం లేకుండా పరోక్ష పన్నును చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు సాయం రూ.10,000కు పెంపు.. బడ్జెట్‌లో ప్రకటన

ఎక్సైజ్ ట్యాక్స్, సేవా పన్ను మరియు వ్యాట్ సహా 12కు పైగా కేంద్ర మరియు రాష్ట్ర పన్నులను ఏకీకృతం చేయడం ద్వారా జూలై 2017లో జీఎస్‌టీ ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశపు అతిపెద్ద పరోక్ష పన్ను సంస్కరణ బిల్లుగా జీఎస్‌టీని ప్రశంసించారు.

సీబీడీటీ ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్ను(Direct Tax)లలో అనేక పెద్ద పన్ను సంస్కరణలను చేపట్టింది. 2019లో కార్పొరేట్ పన్నును 30 శాతం నుండి 22 శాతానికి, డివిడెండ్ పంపిణీ పన్ను కూడా రద్దు అయింది.

Also Read: EPF Wage Ceiling: ఈపీఎఫ్ పరిమితి రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచే యోచనలో ప్రభుత్వం

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link