New Year Free Cab: న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నారా? మీకు రాత్రి ఉచితంగా కారు సర్వీస్
కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో స్వాగతం పలికేందుకు వెళ్తున్న మందుబాబుకు భారీ శుభవార్త.
పార్టీలో మునిగి తేలి తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్లే మందుబాబు కోసం ఉచితంగా రవాణా కల్పించనున్నారు.
డిసెంబర్ 31వ తేదీ మంగళవారం రాత్రి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
న్యూ ఇయర్ సంబరాల సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ తెలిపింది.
మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారనే ఉద్దేశంతో.. వారిని క్షేమంగా ఇళ్లకు చేర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫోర్ వీలర్ అసోసియేషన్ గిగ్ వర్కర్స్ వెల్లడించింది.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 500 కార్లు, 250 బైక్ టాక్సీల డ్రైవర్లు అందుబాటులో ఉంటారని ప్రకటించింది.
సురక్షిత ప్రయాణం కోసం పార్టీల్లో పాల్గొన్న వారు ఉచిత రవాణా సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆ సంఘం సూచించింది.