Business Ideas For Women: మహిళలు దసరాకు రూ. 25వేల పెట్టుబడితో ఈ బిజినెస్ ప్రారంభిస్తే..నెలకు రూ. 50 వేలు సంపాదించే చాన్స్
Women Starting bangle store business: మహిళలు సొంత కాళ్లపై నిలబడాలి అనుకుంటున్నారా? అయితే తప్పనిసరిగా వ్యాపారంలో అడుగుపెట్టడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఎలాంటి వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే అందుకోసం ఒక చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాము. అంతేకాదు మీ బిజినెస్ కోసం పెట్టుబడి ఎలా అని ఆలోచిస్తున్నారా? అందుకు కూడా ఒక పరిష్కారం చూపిస్తున్నాం.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుద్యోగులకు అలాగే వ్యాపారం చేసే వారికి తమ వ్యాపారంలో పురోభివృద్ధి అలాగే వ్యాపారం ప్రారంభించడానికి ముద్ర రుణాలను అందిస్తోంది. ఈ రుణాలు 50 వేల రూపాయల నుంచి పది లక్షల వరకు పొందవచ్చు. ఇందుకోసం మీరు స్థానికంగా ఉన్నటు వంటి ప్రభుత్వ బ్యాంకులను సంప్రదిస్తే సరిపోతుంది.
ఈ రుణాల కోసం మీరు ఎలాంటి ఆస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. బయట ప్రైవేటు వడ్డీ రుణాలతో పోల్చి చూస్తే చాలా తక్కువ అని చెప్పవచ్చు. అంతేకాదు మీరు సులభ వాయిదాలలో ఈ రుణాలను తిరిగి చెల్లించుకోవచ్చు. మీరు 50 వేల రూపాయలతో వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే శిశు ముద్ర రుణం తీసుకోవడం ద్వారా బిజినెస్ ప్రారంభించవచ్చు. ఇందుకోసం లేడీస్ ఎంపోరియం ఓ చక్కటి పరిష్కారం బిజినెస్ ఐడియా అని చెప్పవచ్చు.
లేడీస్ ఎంపోరియం ఏడాది మొత్తం డిమాండ్ ఉన్న బిజినెస్. ముఖ్యంగా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే మహిళలకు అవసరమైనటువంటి బొట్టు బిళ్ళల నుంచి చీరల వరకు అన్ని విక్రయించుకోవచ్చు. బ్యూటీ ఉత్పత్తులు, గాజులు, ఆర్టిఫిషియల్ ఆభరణాలు ఇలా ఒకటేమిటి ప్రతిదీ మహిళలకు సంబంధించిన అన్ని వస్తువులు లేడీస్ ఎంపోరియం లో విక్రయించవచ్చు. తద్వారా మీరు ప్రతి నెల డిమాండ్ తగ్గని వ్యాపారం పొందే అవకాశం ఉంటుంది.
లేడీస్ ఎంపోరియం కోసం మీరు కనీస పెట్టుబడి 25 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు పెట్టవచ్చు. ఇందులో ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులను మీరు విక్రయించినట్లయితే మీకు కనీసం 50% మార్జిన్ లభిస్తుంది. అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ పై కూడా మీకు కనీసం 10 శాతం వరకు మార్జిన్ లభించే అవకాశం ఉంది.
దీనికి తోడు రకరకాల ఉత్పత్తులపై మీకు మంచి మొత్తంలో ప్రాఫిట్ మార్జిన్ లభిస్తుంది. అయితే మీరు లేడీస్ ఎంపోరియం బేస్ చేసుకొని చీరలు కూడా విక్రయించవచ్చు. అలాగే టైలరింగ్ సామాగ్రిని కూడా విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. లేడీస్ ఎంపోరియం లో నిత్యం డిమాండ్ ఉండే వస్తువులు ఏమేం ఉన్నాయో వాటిని లిస్ట్ చేసుకొని ఎప్పటికీ మహిళలకు అందుబాటులో ఉంచితే మీకు చక్కటి వ్యాపారం జరిగే అవకాశం ఉంటుంది.
మీరు ప్రతి నెల 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సరుకులు అమ్మినట్లయితే. వీటిపైన మీకు కనీసం 30 నుంచి 50శాతం వరకు మార్జిన్ లభించే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన చూస్తే మీకు కనీసం నెలకు 50 వేల రూపాయలు లభించే అవకాశం ఉంటుంది.