Business Ideas : ఇల్లు కదలకుండా ఇంట్లోనే నెలకు రూ. 1 లక్ష సంపాదించే బిజినెస్..మహిళలకు బంపర్ ఆఫర్
Business Ideas : ప్రస్తుత కాలంలో అందం పట్ల అవగాహన చాలా పెరిగిపోయింది. ఈ సోషల్ మీడియా యుగంలో అమ్మాయిలు అబ్బాయిలు తమ రీల్స్ కోసం అందంగా తయారయ్యేందుకు సిద్ధపడుతున్నారు. ఇక పెళ్లిళ్లు శుభకార్యాలలో ఫోటోలు వీడియోలో అందంగా కనిపించేందుకు అమ్మాయిలు మేకప్ ఆర్టిస్టులను సైతం ఆశ్రయిస్తున్నారు.
దీని మీరు ఒక చక్కటి వ్యాపార అవకాశం గా మార్చుకోవచ్చు. మేకప్ ఆర్టిస్ట్ గా మారెందుకు మీరు బ్యూటీషియన్ కోర్స్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో బ్యూటిషన్లకు మంచి డిమాండ్ ఉంది. బ్యూటీషియన్ కోర్స్ కోసం తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెట్విన్ సంస్థ జంట నగరాల్లో శిక్షణ అందిస్తోంది.
కేవలం 3000 రూపాయలకే సర్టిఫికెట్ కోర్సు మీకు అందుబాటులో ఉంటుంది. ఈ కోర్సు చేయడం ద్వారా మీకు సర్టిఫికెట్ కూడా లభిస్తుంది.అనంతరం మీరు మేకప్ ఆర్టిస్టుగానూ, బ్యూటీషియన్ గానూ మారవచ్చు.
ప్రస్తుతం వివాహాది శుభకార్యాలలో బ్యూటిషియన్లకు మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు, క్లైంట్లను బుక్ చేసుకొని మీరు వివాహాది శుభకార్యాలలో మేకప్ సర్వీస్ అందిస్తే సరిపోతుంది. బ్రైడల్ మేకప్ చేసే మేకప్ ఆర్టిస్టులకు కనీసం 10,000 రూపాయల నుంచి 50,000 రూాపయల వరకూ అందిస్తున్నారు.
ఒకవేళ మీరు అసిస్టెంటుగా వెళ్లినట్లయితే ఒక్కో వివాహంలో మీకు కనీసం వెయ్యి రూపాయల వరకు లభిస్తుంది. ఈ విధంగా చూసినట్లయితే, మీరు నెలకు 10 వివాహాలకు మేకప్ ఆర్టిస్టుగా వెళితే, నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం లభిస్తుంది.
అలాగే మీరు బ్యూటీషియన్ గా ఖాళీ సమయాల్లో ఇంటి వద్దనే బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకొని.. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకున్న అవకాశం ఉంటుంది. ఇందుకోసం మీరు కనీసం పెట్టుబడి 50 వేల నుంచి లక్ష రూపాయలు వరకు పెట్టాల్సి ఉంటుంది. బ్యూటీ పార్లర్ ద్వారా మీరు నేరుగా క్లైంట్లను పొందవచ్చు. అలాగే మీరు పెద్ద మొత్తంలో బిజీగా పని చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఇక పెళ్లిళ్ల నుంచి మేకప్ ఆర్టిస్టుగా అవకాశం లభించినట్లయితే మీరు మరింత డబ్బు సంపాదించుకున్న అవకాశం లభిస్తుంది. తద్వారా మీకు అదనంగా ఆదాయం సంపాదించుకోవచ్చు.