Small Business Ideas: ఉద్యోగం లేదని బాధపడకండి..కేవలం 2500 రూపాయలతో ఈ కోర్సు చేస్తే చాలు నెలకు 50,000 పక్కా
Best Business Ideas: మీరు బిజినెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా.. అయితే ఉద్యోగం గురించి ఎదురు చూసి అలసిపోయారా. మీరు సొంత కాలం పైన నిలబడేందుకు వ్యాపారం అనేది ఓ చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో అనేక బిజినెస్ లు చేసుకునేందుకు ఈజీగా ఉన్నాయి. అంతేకాదు వీటి ద్వారా చక్కటి ఆదాయం కూడా పొందవచ్చు. అలాంటి ఓ బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీకు సంవత్సరంలో 365 రోజులపాటు ఉపాధి లభిస్తుంది.
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడని వారు అంటూ ఎవరూ లేరు అని చెప్పవచ్చు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడ్డారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ రిపేర్లు వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళ కన్నా కూడా ప్రైవేటుగా మొబైల్ రిపేర్ సర్వీసింగ్ సెంటర్లకు వద్దకు వెళ్లేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వీరి వద్ద తక్కువ ధరకే మంచి క్వాలిటీ సర్వీసింగ్ లభిస్తుందని నమ్ముతారు. పైగా ఇంటి సమయం లోనే ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది వచ్చినా సర్వీసు లభిస్తుందని భావిస్తారు.
మీరు దీన్నే ఒక అవకాశం గా మార్చుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెట్విన్ సంస్థ నిరుద్యోగ యువతీ యువకులకు జంట నగరాల్లో పలు ఉపాధి శిక్షణ కోర్సులు అందిస్తోంది. వీటిల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను సైతం జారీ చేస్తారు. ప్రస్తుతం మొబైల్ సర్వీసింగ్ కోర్స్ గురించి తెలుసుకుందాం. ఈ కోర్సు చేయడం ద్వారా మీరు ప్రత్యక్షంగా మొబైల్ కంపెనీలో ఉద్యోగం పొందవచ్చు. లేదా మీరే సొంతంగా మొబైల్ సర్వీసింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవచ్చు.
మొబైల్ సర్వీసింగ్ కోర్స్ కోసం మీరు మొత్తం 2500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ కోర్స్ వ్యవధి మూడు నెలలు. అలాగే దీనికి ఎలాంటి విద్యా అర్హతలు కూడా లేవు టెన్త్ పాస్/ ఫెయిల్ ఎవరైనా ఈ కోర్సు చేయవచ్చు.అయితే ప్రాథమిక విద్య పైన కాస్త అవగాహన కలిగి ఉండాలి.
ఈ కోర్సు పూర్తి అయిన అనంతరం మీకు సెట్విన్ సంస్థ నుంచి సర్టిఫికెట్ కూడా జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లో ఉద్యోగం కూడా పొందవచ్చు. అంతేకాదు మీరు సొంతంగా మొబైల్ రిపేర్ షాప్ ను కూడా ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు మంచి ఉపాధి పొందే అవకాశం లభిస్తుంది. మొబైల్ సర్వీసింగ్ షాప్ పెట్టడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం లభిస్తుంది.
అంతే కాదు మీరు మొబైల్ ఫోన్స్ కూడా విక్రయించవచ్చు. దీంతోపాటు మొబైల్ యాక్సెసరీస్ విక్రయించడం ద్వారా మీరు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు మొబైల్ పైన గ్లాస్ కవర్, మొబైల్ కవర్లు, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, ఇతర పరికరాలను విక్రయించడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది.