Business Ideas: మహిళలూ సూపర్ డూపర్ బిజినెస్ ఐడియా మీకోసం..రూ. 4 లక్షలు ఉంటే చాలు..ఏడాదికి రూ. 27లక్షలు మీవే
Business Ideas: ఈ రోజుల్లో ప్రతిరంగంలోనూ పోటీ పెరిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలు దొరకక..ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేయలేక యువత వ్యాపారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు వీరికి చాలా ప్రభుత్వ పథకాలు తోడ్పాటు కూడా అందిస్తున్నాయి. అయితే తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభాలు అందించే వ్యాపారం ఒకటి ఉంది. దీంతో కేవలం రూ. 4లక్షల పెట్టుబడి పెడితే..ఏడాదికి రూ. 27లక్షల వరకు లాభాన్ని పొందవచ్చు. అదే పీవీసీ వైర్, కేబుల కోటింగ్ వ్యాపారం.
పీవీసీ వైర్, కేబుల్ కోటింగ్ బిజినెస్ ప్రారంభించేందుకు తక్కువ పెట్టుబడి అవసరం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు 20 నుంచి 30లక్షలు ఖర్చు అవుతుంది. అయితే మీ దగ్గర 4 లక్షల ఉంటే చాలు. ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా మిగతా డబ్బు మొత్తం లోన్ రూపంలో తీసుకోవచ్చు.
పీవీసీ వైర్లు, కేబుల్ విద్యుత్ సరఫరా, పవర్ డిస్ట్రిబ్యూషన్, మెషిన్లు, డివైజ్ ల వైరింగ, ఆటోమొబైల్స్, విద్యుత్ పరికరాలు వంటి అనేక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. అందుకే దేశంలో పీవీసీ వైర్లు, కేబుల్స్ కు చాలా డిమాండ్ ఉంది. చిన్న తయారీదారులకు ఈ మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. పెద్ద కంపెనీలు పక్కన పెడితే..పీవీసీ వైర్, కేబులో కోటింగ్ పరిశ్రమ చిన్న, మధ్య తరగతి వ్యాపారం యాజమానులకు మంచి ప్రాఫిటబుల్ ఇన్ కమ్ సోర్సుగా మారింది.
కాగా ఈ బిజినెస్ యూనిట్ కు మొత్తం రూ. 40లక్షలు ఖర్చు అవుతుంది. అందులో 4లక్షలు వ్యాపారులు సొంతంగా భరించుకోవాలి. 9లక్షల వరకు వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది. ఇండస్ట్రియల్ సెటప్ కు 1500 నుంచి 2000 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. సొంత స్థలం లేకుంటే అద్దె కూడా తీసుకోవచ్చు.
పీవీసీ వైర్, కేబుల్ కోటింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు కొంత పేపర్‌వర్క్ చేయాలి. కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. GST రిజిస్ట్రేషన్ చేయించాలి. ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ ఆప్షనల్. వ్యాపారానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ నేమ్ సెలక్ట్ చేసుకోని.. దానిని ట్రేడ్‌మార్క్ చేయాలి. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసీ కూడా తప్పకుండా ఉండాలి.
ఇక ఈ వ్యాపారంలో ప్లాంట్ అండ్ మెషినరీకి రూ.28.60 లక్షలు, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్‌కు రూ.1.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ రూ.10 లక్షలు ఉండాలి. మొత్తం రూ.40 లక్షలు అవసరం. ఒకవేళ మీకు సొంత భూమి ఉంటే తక్కువ ఖర్చు అవుతుంది. లేదంటే ల్యాండ్ కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం ఖర్చు ఎక్కువగా అవుతుంది.
కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి ప్రముఖ బ్రాండ్స్ ధరకు వైర్లు, కేబుల్స్ ను అమ్మడం కష్టంగా ఉంటుంది. అందుకే ఉత్పత్తిపై కాస్త తక్కువ ధరకు అమ్మాల్సి ఉంటుంది. బ్రాండ్ గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఒక సాలిడ్ మార్కెటింగ్ అవసరం. పీవీసీ వైర్లు, కేబుల్స్ స్థానిక దుకాణాలు, సూపర్ మార్కెట్లు, ఇతర వ్యాపారులకు కూడా విక్రయించవచ్చు. ఆన్ లైన్ సేల్స్ ద్వారా కూడా మంచి లాభాన్ని పొందవచ్చు.
అయితే ఈ వ్యాపారాన్ని మహిళలు కూడా ప్రారంభించవచ్చు. కాస్త తెలివి తేటలు ఉంటే సరిపోతుంది. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు.