Car Expenditure: కొత్త కారు కొంటున్నారా? ఒక నిమిషం ఆగి ఇవి తెలుసుకోండి..లేదంటే భారీగా నష్టపోతారు

Thu, 05 Sep 2024-1:03 pm,

Buying  A New Car: నేటికాలంలో చాలా మంది కొత్త కారు కొనుగోలు చేస్తున్నారు. సామాన్య మధ్య తరగతి కుటుంబాలు కారు కొనడం అనేది ఒక్కప్పుడు కలగా ఉండేది. కానీ నేటికాలంలో వారు కారును కొనుగోలు చేస్తున్నారు. కారు కొనేందుకు కష్టపడి సంపాదిస్తున్నారు. లేదంటే బ్యాంకులో లోన్ తీసుకుంటున్నారు. బ్యాంకులో లోన్ తీసుకుని లేదంటే కష్టపడి సంపాదించిన డబ్బుతో కారు కొనగానే సరిపోదు. కారును మెయింటెన్ చేయడం మామూలు విషయం కాదు. ఎన్నో ఖర్చులు ఉంటాయి. కొన్ని కార్లను మెయింటెన్ చేయడం సామాన్యులకు కష్టంగానే ఉంటుంది.అందుకే కారు కొనుగోలు చేసే ముందకు ఎలాంటి అదనపు  ఖర్చులు ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.   

మనం కొత్తగా కారును కొనుగోలు చేసేటప్పుడు డౌన్ పేమెంట్ ను చెల్లిస్తాం. ఒకవేళ బ్యాంకు నుంచి లోన్ తీసుకుని కారు కొనుగోలు చేస్తే నెలవారీగా ఈఎంఐ చెల్లిస్తుంటాం. దీనికి తోడు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్డు ట్యాక్స్ , వెహికల్ ఇన్సూరెన్స్  కట్టాల్సిందే. వీటితో పని అయిపోందనుకోకండి. కారుకు నెలలవారీ ఇంధన ఖర్చులు ఉంటాయి. మెయింటెనెన్స్ ఉంటుంది. అంతేకాదు కారుకు అప్పుడప్పుడు సర్వీసింగ్ కూడా చేయించాలి. రిపేర్ ఖర్చులు తప్పవు. వీటిన్నింటికి బోలేడు డబ్బు ఖర్చు చేయాల్సిందే. కాబట్టి కారు కొనే ముందు ఈ ఖర్చుల గురించి మీరోసారి ఆలోచించడం తప్పనిసరి. ఫైనాన్స్ ద్వారా కారు కొంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.   

బ్యాంకు ఫీజులు, ఛార్జీలు : బ్యాంకు లోన్ లేదా ఫైనాన్స్ నుంచి మీరు వెహికల్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తారు. నిర్ణీత సమయం కంటే ముందుగానే లోన్ అమౌంట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే లోన్ ప్రీ పేమెంట్ ఛార్జీలు విధిస్తాయి. 

ఇన్సూరెన్స్ : మనదేశంలో వెహికల్స్ కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇదొక్కటే సరిపోదు. ఆపద కాలంలో మీకు అవసరానికి వచ్చే విధంగా సమగ్రంగా బీమా పాలసీ కూడా తీసుకోవాలి. అప్పుడే మీకు ఆర్థికంగా సేఫ్టీఉంటుంది. దీనికి తోడు  ఎక్స్ ట్రా ఫీజులు, ఛార్జీలు కూడా ఉంటాయి.   

టాక్స్ : కారు కొనేటప్పుడు రాష్ట్రాలు వాహన రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తాయి. కారు ధర, ఇంజిన్ కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. రోడ్డు ట్యాక్స్కూడా రిజిస్ట్రేషన్ సమయంలో ఒకేసారి చెల్లించాలి.   

యాక్సెసరిస్ : కొన్న కారులో అన్నీ మనకు నచ్చినట్లుగా ఉండవు. కాబట్టి అదనపు యాక్సెసరిస్ కొని వాటిని ఇన్ స్టాల్ చేయాలి.   

పెట్రోల్, డిజీల్ ఖర్చులు: కారు కొంటే దానికి పెట్రోల్ లేదా డీజిల్ తప్పకుండా కొట్టించాల్సిందే. కాబట్టి ఇంధనం ఖర్చులు తప్పవు. 

టోల్ ఛార్జీలు, కారు రిపేర్స్, పార్కింగ్ ఫీజులు, మెయింటెనెన్స్ ఖర్చులు ఇలా ఎన్నో ఉంటాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link