Smart phone: మీ మొబైల్ ను చోరీ చేశారా..?.. డోంట్ వర్రీ.. నిముషాల్లో ఈ టెక్నాలజీతో ట్రాక్ చేయోచ్చు..

Sat, 27 Jul 2024-2:53 pm,

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది తప్పనిసరిగా మారిపోయింది. మన జీవితంలో మొబైల్ ఫోన్ అనేది ఒక భాగమైపోయిందని చెప్పవచ్చు. చాలా లమంది మొబైల్ ను వదిలిపెట్టి ఒక్క నిముషం కూడా ఉండరు. ఒక్కనిముషం ఫోన్ కన్పించకుంటే విలవిల్లాడిపోతుంటారు. దైనందీక జీవితంలో ఎన్నో పనులు మొబైల్ ఫోన్ తో కనెక్ట్ అయి ఉన్నాయని చెప్పవచ్చు.

కొందరు కేటుగాళ్లు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఫోన్ లను ఎక్కువగా చోరీలు చేస్తుంటారు. మరికొన్ని సార్లు మనం ఎక్కడైన ఫోన్ లను పెట్టి మర్చిపోవడం లేదా మన చేతితోనే మిస్అవ్వడం వంటివి కూడా జరుగుతుంటాయి. ఇలాంటి నేపథ్యంలో చాలా మంది మొబైల్ ఫోన్ పొగానేఎంతో టెన్షన్ పడిపోతుంటారు. ఇప్పటికి చాలా మందికి ఫోన్ పొగానే ఏంచేయాలో కూడా తెలియదు.

ఇలాంటి వారి కోసం కేంద్రం ఇప్పటికే ఒక పొర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సీఈఐఆర్ (Central Equipment Identity Register). ఇది దొంగిలించబడి, మిస్ అయిన ఫోన్ లను ట్రాక్ చేసేందుకు ఉపయోగ పడుతుంది. దీన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యునిషన్స్ వారు తీసుకొచ్చారు. ఫోన్ దొంగిలించబడిన లేదా కన్పించకుండా పోయిన కూడా వెంటనే దగ్గరలోని పోలీసుస్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి.

పోలీస్ స్టేషన్ లో మనం ఇచ్చిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నెంబర్, ఫోటో కాపీ ను మనతో పెట్టుకొవాలి.  ఆ తర్వాత గూగుల్ లో.. సీఈఐఆర్ పొర్టల్ (ceir.gov.in) ను ఓపెన్ చేయాలి. దీనిలో చోరీకి గురైన మొబైల్ ను తొలుత బ్లాక్ చేసే ఆప్షన్ దాని కింద దొరికిన ఫోన్ ను అన్ బ్లాక్ చేసే ఆప్షన్, ఆ తర్వాత మనం ఇచ్చిన మొబైల్ మిస్సింగ్ కు సంబంధించిన ఫిర్యాదు స్టేటస్ తెలుసుకునేమూడు ఆప్షన్ లు ఉంటాయి. 

చోరీకి గురైన మొబైల్ ను బ్లాక్ చేయాలంటే.. తొలుత  మిస్సింగ్ మొబైల్ ఆప్షన్ వెబ్ పేజీలోకి వెళ్లి.. ప్రజెంట్ ఉపయోగిస్తున్న మొబైల్ ఎంటర్ చేయాలి, ఆ తర్వాత పోయిన ఫోన్ నంబర్, ఐఎంఈఐ, ఫోన్ కంపెనీ, మోడల్,ఎక్కడ పోయింది, ఫిర్యాదు నెంబర్, ఆధార్ కార్డు, వంటివి సబ్మిట్ చేయాలి. ఇలా చేయగానే.. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్ననంబర్ కు ఒక నెంబర్ వస్తుంది. దీంతో  మీ మొబైల్ వెంటనే బ్లాక్ అయిపోతుంది. దానిలో ఏ సిమ్ కార్డు వేసిన కూడా అస్సలు పనిచేయదు.  

అదే విధంగా  మీ ఫోన్ ఎక్కడుందో కూడా ఇదే పోర్టల్ ను ఉపయోగించి కూడా ట్రాక్ చేయడం పోలీసులకు ఈజీ అవుతుంది. అదేవిధంగా పోయిందనుకున్న మొబైల్ మరల దొరికింది. అప్పుడు.. ఎలా అన్ బ్లాక్ చేయాలో తెలుసుకుందాం. చోరీకి గురైన ఫోన్ బ్లాక్ చేసే క్రమంలో చివరగా ఒక నెంబర్ వచ్చి ఉంటుంది. దాన్ని మరల అన్ బ్లాక్ మొబైల్ ఫోన్  అనే పేజీనీ ఓపెన్ చేసి, దానిలో మనం ఉపయోగిస్తున్న ఫోన్, బ్లాక్ చేయడానికి గల కారణాలు, మరల ఓపెన్ చేసేందుకు గతంలో మీ ఫోన్ కు వచ్చిన నంబర్ ను ఎంటర్ చేయాలి. దీంతో మీరు బ్లాక్ చేసిన మొబైల్ మరల పనిచేయడం ప్రారంభిస్తుంది.   

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గత కొన్ని నెలలుగా చోరీకి గురైన ఫోన్ లను పోలీసులు ఇట్టే ట్రాకింగ్ చేసి పట్టేస్తున్నారు. అదే విధంగా ఇదే పోర్టల్ లో మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిలో క్లిక్ చేసి.. మీ ప్రస్తుత మొబైల్ కు వచ్చిన నెంబర్ ను, ఇక్కడ చూపించే కాలమ్ లో ఎంటర్ చేస్తే.. మీ ఫోన్ ట్రాకింగ్ వివరాలు అన్ని అందులో కన్పిస్తుంటాయి. ఈ విధంగా మనం సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా పోయిన ఫోన్ ను తిరిగి సంపాదించొచ్చు. అదే విధంగా ట్రాకింగ్ కూడా చేయోచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link