Central Government Employess: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. అంతా తూచ్..
Central Government Employess: ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. వారి కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్న ఉద్యోగ విరమణ వయసు పరిమితిని పెంచాలని కోరుతున్నాయి.
దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రంలో కొలువు దీరిన నరేంద్ర మోడీ సర్కారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ వయసు 60 యేళ్లు. దీన్ని కేంద్రం మరో రెండేళ్లు అంటే 62 యేళ్ల వరకు పొడిగిస్తూ తాజాగా కేంద్ర క్యాబినేట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
దీని వల్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న ఉద్యోగుల సేవలను ఎక్కువ రోజులు పొందవచ్చని కేంద్ర సర్కార్ ఆలోచిస్తోందనే వార్త స్రెడ్ అయింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా.. ఉద్యోగ పదవి విరమణ వయసును పెంచడం వల్ల నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం అవ్వడం ఖాయం .
ఎంతో కాలంగా కేంద్రం వద్ద ఈ వయసు పెంపు ప్రతిపాదన పెండింగ్ లో ఉంది. తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ముందు కేంద్ర కేబినేట్ సమావేశంలో ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు వార్తలు వచ్చాయి.
ఈ పదవి విరమణ వయసు పెంపు నిర్ణయం 1 ఏప్రిల్ 2025 నుంచి అమల్లోకి రానున్నట్టు చెప్పారు. మొత్తంగా ఈ నిర్ణయంతో కొన్ని లక్షల మందికి ప్రయోజనం కలగడం ఖాయం. కానీ ఉద్యోగులు పదవి విరమణ వయసు పెంపు అనే ముచ్చట అంత తూచ్ అని చెబుతున్నారు.