Chandrababu: చంద్రబాబు కొత్త రికార్డు.. దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఘనత
లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగు వారి ప్రభను సీఎం చంద్రబాబు మరింత పెంచారు. కేంద్రంలో కీలక భూమిక పోషిస్తూ జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు.
తన పరిపాలన.. రాజకీయ వ్యూహాలతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు మరో రికార్డును నెలకొల్పారు.
దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిలిచారు. అత్యధిక సంపాదన కలిగిని ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం మొదటి స్థానంలో నిలిచారు.
ఏడీఆర్ వెల్లడించిన రిపోర్టు ప్రకారం సీఎం చంద్రబాబు ఆస్తుల విలువ రూ.931 కోట్లు ఉన్నాయని వెల్లడైంది.
దేశంలోని 31 ముఖ్యమంత్రుల్లో అత్యధికంగా ఆస్తులు కలిగిన సీఎంగా చంద్రబాబు నిలవడం విశేషం.
ఇక అత్యంత పేద ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. ఆమె ఆస్తులు కేవలం రూ.15 లక్షలు మాత్రమే
ఏడీఆర్ వెల్లడించిన నివేదిక దేశవ్యాప్తంగా కీలక చర్చ జరుగుతోంది. ఏపీలో రాజకీయ దుమారం రేపే అవకాశం లేకపోలేదు.
ఏడీఆర్ వెల్లడించిన రిపోర్టులో మరికొన్ని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.