Cheapest Recharge Plan: కేవలం రూ.2కే 1 GB డేటా, కాల్స్.. ప్లాన్ వివరాలు
Cheapest Recharge Plans: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. పలు రకాల ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.
Also Read: How To Secure Whatsapp: ఈ టిప్స్ పాటిస్తే మీ వాట్సాప్ డేటా సేఫ్
ఇటీవల రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్లలో ఇతర నెట్‌వర్క్‌లకు ఉచిత కాల్‌లను అందించడం అందుకు నిదర్శనం. మీరు అతి చౌకైన డేటా ప్లాన్‌ల కోసం చూస్తున్నారా.. అయితే ఈ వివరాలు మీకోసమే. రూ.2కే 1 జీబీ డేటా ప్లాన్(Cheapest Recharge Plans) పొందండి. వోడాఫోన్ ఐడియా(Vodafone Idea) 449 రూపాయలకు రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది.
రూ.449 రీఛార్జ్ ప్లాన్ కింద మీరు కేవలం 2 రూపాయలకే 1 జీబీ డేటాను పొందవచ్చు. దీని వ్యాలిడిటీ 56 రోజులు. ఇందులో Vi వారు డబుల్ డేటాను అందిస్తున్నారు. ఈ ప్లాన్‌పై ప్రతిరోజూ 2GB డేటాకు బదులుగా 4GB డేటాను అందిస్తోంది. మొత్తంగా Vodafone Idea 224 జీబీ డేటాను అందిస్తోంది.
Also Read: Hike Messaging APP Shuts Down: హైక్ మెసేజింగ్ యాప్ సేవలు బంద్.. హైక్ మెసేంజర్ చరిత్ర ఇది..
రూ.449తో రీఛార్జ్ చేసుకున్నారు. కదా మొత్తం 224 GB డేటాను పొందారు అంటే మీకు 1 జీబీ డేటా కేవలం రూ.2కు లభిస్తుంది. ఇది తక్కువ ధరలకు డేటా అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ ఇదే.
ఈ ప్లాన్ వాడేవారు ఏదైనా నెట్‌వర్క్ నంబర్‌కు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఉచిత SMS లభిస్తాయి. వీటితో పాటు మీరు Vi సినిమాలు మరియు TV ని ఉచితంగా వీక్షించవచ్చు. వీకెండ్ డేటా రోల్ఓవర్ కూడా ఈ ప్లాన్‌కు వర్తిస్తుంది.
Also Read: జనవరి 20 నుంచి Amazon గ్రేట్ రిపబ్లిక్ డే 2021 సేల్స్.. భారీ ఆఫర్లు