Coronavirus on packaged meat: మాంసంతో కరోనావైరస్.. చైనాకు కొత్తగా మరో టెన్షన్
అయితే, మళ్లీ ఇలా మాంసం దిగుమతుల ప్యాకేజీలతో కరోనా ప్రభలే ప్రమాదం లేకపోలేదని చైనా హడలెత్తిపోతోంది.
Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు
read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
Also read : Use of firecrackers in Telangana: తెలంగాణలో టపాసుల విక్రయాలు, వినియోగంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ముందుగా ఈ నెల 13న బ్రెజిల్ నుంచి వుహాన్‌కి వచ్చిన బీఫ్ ప్యాకేజింగ్‌లో మూడు నమునాలను కరోనా పాజిటివ్‌గా గుర్తించినట్టు వుహాన్ మున్సిపల్ ఆరోగ్య కమిషన్ తన వైబ్‌సైట్‌లో పేర్కొంది. ఆగస్టు 7న బ్రెజిల్ నుంచి కింగ్డావో పోర్ట్‌కు చేరిన ఈ బీఫ్ మాంసం ప్యాక్‌లు అక్కడి నుంచి ఆగస్టు 17న వుహాన్‌కు చేరాయని తెలిపారు.
ఆగస్టు 17న బీఫ్ వుహాన్‌కు చేరగా.. అప్పటి నుంచి నుంచి కోల్డ్‌స్టోరేజ్‌లో ఉంచిన బీఫ్‌ని ఇటీవలే బయటికి తీసి కరోనా పరీక్షలు జరిపినప్పుడు ఈ విషయం వెల్లడైనట్టు వుహాన్ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ( Reuters photo )
దీంతో వూహాన్ ఫెసిలిటీ సెంటర్‌లో పనిచేస్తున్న సిబ్బందిలో వంద మందికిపైగా సిబ్బందికి కరోనావైరస్ పరీక్షలు జరిపారు. ఆ ప్రాంతం నుంచి మరో 200 కరోనా శాంపిల్స్‌ని సేకరించి వైరస్ పరీక్షలకు పంపించినట్టు వుహాన్ మున్సిపల్ ఆరోగ్య కమిషన్ స్పష్టంచేసింది.
సౌది అరేబియా నుంచి దిగుమతి అయిన రొయ్యల మాంసం ప్యాకిట్స్‌లోనూ కరోనా ఆనవాళ్లు ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ వరుస పరిణామాలు చైనాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ( Reuters photo )
పరిస్థితి ఇలాగే కొనసాగితే.. దేశంలో కరోనాను అంతమొందించినా... అది ఎప్పటికప్పుడు విదేశాల నుంచి దిగుమతి అవుతూనే ఉంటుందనే భయం చైనాను వెంటాడుతోంది.
ప్రపంచంలోనే అత్యధికంగా బీఫ్‌ని దిగుమతి చేసుకుంటున్న దేశం చైనా కాగా.. బ్రెజిల్, అర్జెంటినా దేశాలు అత్యధికంగా బీఫ్ ఎగుమతి చేసే దేశాల జాబితాలో ఉన్నాయి.
యావత్ ప్రపంచానికి కరోనా వ్యాప్తికి కారణమైన చైనాలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు
read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
Also read : Use of firecrackers in Telangana: తెలంగాణలో టపాసుల విక్రయాలు, వినియోగంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు