Cluster Beans: కొలెస్ట్రాల్‌ను ఐస్‌లా కరిగించే గోరుచిక్కుడు.. వారానికి ఒక్కసారైనా తింటున్నారా?
ముఖ్యంగా చాలామంది మహిళలు ఐరన్ లేమితో బాధపడుతుంటారు. దీంతో వారు బలహీన సమస్యతో బాధపడుతుంటారు. అందుకే గోరుచిక్కుడు మహిళలకు వరం. దీన్ని కనీసం వారంలో ఒకటి రెండుసార్లైనా తినాలి. దీంతో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇనుము లేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు.
మన దేశంలో చాలామంది డయాబెటీస్, బీపీతో బాధపడుతుంటారు. వారు కచ్చితంగా వారానికి ఒక్కసారైనా గోరుచిక్కుడు తినాలి. ముఖ్యంగా హై బీపీతో బాధపడేవారికి గోరు చిక్కుడు ఎఫెక్టీవ్ రెమిడీ. ఇది ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు గుండె జబ్బులు, డయాబెటీస్ ఉన్నవారు కూడా గోరుచిక్కుడు తినాలి.
అంతేకాదు ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకు కూడా గోరుచిక్కుడు ఎంతో ఉపయోగకరం ఎందుకంటే ఇందులో ఫోలెట్ ఉంటుంది. ఇది పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ సమయంలో మహిళలకు ఐరన్ ,కాల్షియం కూడా అందిస్తుంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో గోరుచిక్కుడు తినాల్సిందే.
గోరుచిక్కుడు తినేవారిలో హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఈ కూరగాయ ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో ఉండే ఫాస్పరస్ ,క్యాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. అందుకే ఈ కూరగాయ పిల్లలకు పెట్టండి.
కొలెస్ట్రాల్‌ను కూడా ఈజీగా తగ్గించేస్తుంది గోరుచిక్కుడు అందుకే ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి గోరుచిక్కుడు బెస్ట్ రెమిడీ. గోరుచిక్కుడులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరగకుండా ఉంటటానికి సహాయపడుతుంది. గోరుచిక్కుడులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్య రాకుండా నివారిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )