CM Revanth Reddy: దంచికొడుతున్న వానలు.. అధికారులు సెలవులు పెట్టొద్దు.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్..
తెలంగాణను వరదలు వణికిస్తున్నాయి. ఎక్కడ చూసిన కూడా రోడ్లన్ని చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే ఆకాశానికి చిల్లుపడిందా అన్న విధంగా వర్షం కురుస్తుంది. వాగులు, వంకలు పొర్లుతున్నాయి. అంతేకాకుండా.. జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది.
మరోవైపు వాతావరణ శాఖ రానున్నమూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తుయని కూడా రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం రేవంత్ మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
ఎక్కడైతే వరద ప్రభావం ఎక్కువగా ఉంటుదో ఆయా ప్రాంతాలకు మంత్రులు, అధికారులు వెళ్లాలని సూచించారు. ప్రజలకు అందిచాల్సిన సహాయక చర్యలను దగ్గరుండి చూసుకొవాలన్నారు. ముంపు గ్రామాల ప్రజలను ఆయా జిల్లాల కలెక్టర్ లు సెఫ్టీ ప్రదేశాలకు తీసుకెళ్లాలని సూచించారు.
ముఖ్యంగా చెరువులు, నదులు, ప్రాజెక్ట్ పరివాహాక ప్రదేశాలలో ఉన్న ప్రాంతాలో అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఎప్పడికప్పుడు.. జిల్లాలోని సమాచారంను ముఖ్య అధికారులకు చేరవేస్తు ఉండాలని చెప్పారు. అంతేకాకుండా.. వరద బాధితులకు నిత్యవసరాలు, ఆహారం వంటి సదుపాయాల్ని దగ్గరుండి చూసుకొవాలని రేవంత్ రెడ్డి సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వర రావు, దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావు.. జిల్లాల ముఖ్యఅధికారులు, సీఎస్ లతో సమావేశం నిర్వహించారు.
తెలంగాణ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఎవరు కూడా సెలవులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రెవెన్యూ, వైద్య సిబ్బంది ఎప్పటి కప్పుడు ప్రజలను జాగ్రత్తగా సూచనలు చేస్తు ఉండాలన్నారు. అదే సమయంలో అంటు వ్యాధులు సైతం ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకొవాలని కూడా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, ప్రజలకు భరోసా ఇవ్వాలన్నారు. ప్రజలకు ఏవిధమైన సహాయం కావాలన్న దగ్గరుండి చూసుకొవాలని సీఎంరేవంత్ కీలక సూచనలు చేశారు.
అత్యవసర పనుకుంటే తప్పా ప్రజలు బయటకి రావొద్దని ప్రజలకు సీఎం రేవంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 24 గంటలు అలెర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగంగా కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సీఏం ఆదేశించారు.