2024 Top Grossers: ‘దేవర’ టూ ‘కల్కి’ వరకు 2024 ఎక్కువ వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాలు..

Thu, 24 Oct 2024-11:39 am,

1. కల్కి 2898 AD - ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ మూవీ  మన దేశ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు   రూ. 777 కోట్ల గ్రాస్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

2. స్ట్రీ 2 -  శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్త్రీ 2’ మూవీ మన దేశ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు  రూ 707 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం.  

 

3. దేవర పార్ట్ 1 - ఎన్టీఆర్ హీరోగా జాన్వీకపూర్ హీరోయిన్ గా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మన దేశ బాక్సాఫీస్ దగ్గర  రూ. 350 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్ట.

4. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ - విజయ్ ద్విపాత్రాభినయంలో విక్రమ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ ఈ చిత్రం ఓన్లీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర  రూ. 293 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

5. ఫైటర్ - హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొణే హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఫైటర్’  చిత్రం ఓన్లీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 243 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

6. హను-మాన్ -  ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర  రూ. 240 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

7. షైతాన్ - అజయ్ దేవ్ గణ్, మాధవన్ హీరోలుగా  జ్యోతిక ముఖ్యపాత్రలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర  రూ. 178 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

8. మంజుమ్మెల్ బాయ్స్ - మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మన దేశంలోనే  రూ. 170 కోట్లు వసూళ్లు చేసాయి. 

9. వెట్టయన్ -  రజినీకాంత్ హీరోగా జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు మన దేశ బాక్సాఫీస్ దగ్గర రూ. 165 కోట్లు వసూళు చేసాయి.

10. గుంటూరు కారం  - త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా మన భారత దేశ బాక్సాఫీస్ దగ్గర  రూ 142 కోట్లు వసూళు చేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link