Disha Patani: టైట్ ఔట్ఫిట్లో దాచినా దాగని దిశా పటానీ అందాలు.. కల్కి భామ గ్లామర్ ట్రీట్ ఫ్యాన్స్ ఫిదా..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో జన్మించిన దిశా పటానీ.. ముందుగా మోడల్‌గా పనిచేసింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన 'లోఫర్' మూవీతో హీరోయిన్గా పరిచయం అయింది.
దిశా స్టార్టింగ్ నుంచి మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేయడం ఈ భామ స్పెషాలిటీ.
తెలుగులో 'లోఫర్' మూవీతో పరిచయమైన దిశా పటానీ.. హిందీలో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ' మూవీతో బాలీవుడ్లో విజయ పతాకం ఎగరేసింది.
ఎప్పటి కప్పుడు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈమెకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 61 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
దిశా పటానీ ఏ మాత్రం టైమ్ దొరికిన సోషల్ మీడియాలో అభిమానులతో మాటామంతీ అంటూ చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
రీసెంట్గా సిద్దార్ధ మల్హోత్ర హీరోగా నటించిన 'యోధ' మూవీతో పలకరించింది. ఈ సినిమాకు టాక్ బాగానే ఉన్న ఓ మోస్తరు వసూళ్లనే రాబట్టింది.
ప్రస్తుతం హిందీలో టాప్ కథానాయికగా రాణిస్తోన్న దిశా పటానీ.. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'కల్కి 2898 AD' మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. అటు సూర్య హీరోగా నటిస్తోన్న 'కంగువా'లో కథానాయికగా నటిస్తోంది.