Heart Attack: చల్లిని నీళ్లతో స్నానం చేస్తే.. గుండెపోటు వస్తుందా..?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..?
ఒకప్పుడు 45 ఏళ్లు దాటిన తర్వాత బీపీలు, షుగర్ లు, ఫ్యాట్ ల వంటి సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిన్నతనంలోనే.. షుగర్ సమస్యలు వస్తున్నాయి. కనీసం నిండా పట్టుమని పదేళ్లు కూడా లేని వారికి కూడా చక్కెర వ్యాధి వస్తుంది.
అంతే కాకుండా.. ఇటీవల కాలంలో చాలా మంది గుండెపోటుతో చనిపొతుండటం కాస్తంతా టెన్షన్ కు గురిచేసేదిగా మారిందని చెప్పుకొవచ్చు. అప్పటి వరకు డ్యాన్స్ లు చేస్తు, ఆఫీసుల్లో పనులు చేస్తు, పార్టీలలో ఎంజాయ్ చేస్తున్న వారు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ప్రతిచోట జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని చెప్పుకొవచ్చు. అయితే.. చలికాలంలో చాలామంది చల్లని నీళ్లతో స్నానం చేస్తుంటారు. చాలా మంది తల మీద ఒక్కసారిగా చల్లని నీళ్లు పొసుకుంటారు. దీని వల్ల.. హర్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అంటున్నారు.
తలపై చల్లని నీళ్లు పోసుకొగానే.. ఒక్కసారిగా రక్త ప్రసరణ సంకోచంకు గురౌతుందంట. దీని వల్ల రక్త ప్రసరణలో తీవ్ర అంతరాయం ఏర్పడి.. ఒక్కసారిగా గుండెపోటు సంభవించే అవకాశాలు ఉన్నాయంట. అందుకే స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలంట
చల్లని నీళ్లను తల మీద ఒక్కసారిగా వేసుకోకుండా.. మొదత కాళ్ల మీద, వీపు మీద, మెడ ఇలా.. ఆ తర్వాత తల మీద వేసుకొవాలంట. అసలైతే.. చలికాలంలో తప్పనిసరిగా వేడి నీళ్లతో లేదా.. గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
అందుకే చలికాలంలో ప్రయోగాలు చేసి లైఫ్ ను రిస్క్ లో పడేసుకొవడం కంటే.. గోరు వెచ్చని నీళ్లు లేదా.. వేడీ నీళ్లతో స్నానం చేయాలని నిపుణులు మాత్రం సలహా ఇస్తున్నట్లు తెలుస్తొంది.