Eesha Rebba: బ్లాక్ అండ్ వైట్ లో ఈషా రెబ్బ.. అభిమానులను అలరిస్తున్న అమ్మడి ఫోటోలు..
Eesha Rebba Instagram Pics: ఈషా రెబ్బ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ఆ తర్వాత సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూనే.. సెకండ్ హీరోయిన్ గా ఎన్నో చిత్రాలలో నటించింది.
అయితే ఈ హీరోయిన్ కి అనుకున్న స్థాయిలో స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. అందం అభినయం ఉన్నా కానీ స్టార్ హీరోల సినిమాలలో అవకాశం కూడా దక్కలేదు.
ఇక సినిమాలు పక్కన పెట్టి ఎక్కువ వెబ్ సిరీస్ లో నటించడం ప్రారంభించింది. త్రీ రోజెస్.. పిట్ట కథలు లాంటి వెబ్ సిరీస్ లో కనిపించి అందరిని మెప్పించింది.
ప్రస్తుతం ఈ హీరోయిన్ షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమాలలో కన్నా కూడా తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది ఈ నటి.
బ్లాక్ షర్ట్ అండ్ ఫాంట్ వేసుకొని.. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసింది ఈషా రెబ్బ. ఈ ఫోటోలకు ఆమె అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఫోటోలలో చాలా స్టైలిష్ గా కనిపిస్తూ అందరిని అలరిస్తోంది ఈషా. మరి ఇప్పటికైనా ఈ నటికి మంచి సినిమా అవకాశాలు వస్తాయో లేదో వేచి చూడాలి.