Facebook Tracking: మీ ఫోన్‌లో ఈ మార్పులు చేస్తే చాలు..ఫేస్‌బుక్ మిమ్మల్ని ట్రాక్ చేయలేదిక
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విజయంలో ఫేస్‌బుక్ యూజర్ల డేటా ఎక్కువగా ఉపయోగపడిందనే విషయం తెలిసిందే. కేంబ్రిడ్జ్ ఎనలిటిక్స్ ప్రకారం ఫేస్‌బుక్ సంస్థ..యూజర్ల డేటాను దుర్వినియోగం చేసింది.
మీ మొబైల్ ఫోన్‌లో ఆఫ్ ఫేస్‌బుక్ యాక్టివిటీ ట్రాకింగ్ ఫీచర్ అనేది యాక్టివేట్ అయుంటుందని మీకు తెలిసి ఉండదు. దీని సహాయంతో ఫేస్‌బుక్..మొబైల్ ఫోన్‌లో ఉన్న వెబ్‌సైట్స్, ఇతర యాప్‌లపై నిఘా పెడుతుంది.
ఫేస్‌బుక్ మీ మొబైల్ ఫోన్, డెస్క్‌టాప్ నుంచి చాలా విలువైన డేటా తీసుకుంటుంది. ఉదాహరణకు ఇతర యాప్స్ నుంచి కొనుగోలు చేసే సామాన్ల వివరాలు, కార్ట్‌లో ఉంచే వస్తువులు, సెర్చ్ చేసే వస్తువుల వివరాల్ని తీసుకుంటుంది. అంతేకాదు..మీ కాంటాక్ట్స్, ప్రకటనలు, లొకేషన్ కూడా తెలుసుకుంటుంది. ఫేస్‌బుక్‌కు మీ ఇంటి చిరునామా కూడా తెలుసు.
ముందుగా ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేయండి. మెనూ ఆప్షన్‌లో వెళ్లండి. అందులో Settings and Privacy ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు Permissions ట్యాబ్‌ను ఓపెన్ చేయండి. తరువాత Refuse permissions for all settings సెలెక్ట్ చేయండి.
మీ ఫేస్‌బుక్ యాప్ సెట్టింగ్‌లో hamburger ఐకాన్‌పై క్లిక్ చేయండి. తరువాత Settings and Privacy ఓపెన్ చేయండి. ఇప్పుడు off-Facebook Activity పై ట్యాప్ చేయండి. తరువాత Clear History ఎంచుకోండి.