Home Cleaning Tips: వర్షాకాలంలో మీ ఇల్లు దుర్వాసన లేకుండా ఉండటానికి ఈ చిట్కాలు...
ఈ సీజన్‌లో ఇంట్లో దోమలు, ఈగలు కూడా విపరీతంగా పెరిగి పోతాయి. ఇవి ఇంటిక మరింత దుర్వాసనను ఇస్తుంది. వర్షాకాలంలో కీటకాలు వంటివి రాకుండా చర్యలు తీసుకోవాలి.
వర్షాకాలంలో ఇంట్లోకి ధూళి, దుమ్ము, దుర్వాసన తీసుకురావడంలో షూస్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇంట్‌లో చెప్పులు, బూట్లను పెట్టుకుంటే ఒక కవర్‌లో చుట్టండి. ఇలా చేయడం వల్ల దుర్వాసన రాకుండా ఉంటుంది. బూట్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..
వర్షాకాలం సమయంలో ఇంట్లో ఏ చిన్నపాటి దుర్వాసన కూడా గాలిలోకి వ్యాపించి ముక్కు మూసుకుపోతుంది. కాబట్టి ఉప్పు ఇంటిని శుభ్రం చేసినప్పుడు ఉపయోగించండి. అలాగే ఇంటి గదిలో మూలలో ఒక కప్పులో ఉప్పు వేసి పెట్టాలి. ఇలా చేయడం వల్ల తేమను గ్రహించి చెడు వాసన రాకుండా చేస్తుంది.
ముఖ్యంగా ఈ సీజన్‌లో ఇంటి గదులు, కిటికీలు బాగా తెరచి ఉంచండి. ఎందుకంటే వర్షాకాలం ఇంటి గోడలకు కూడా తేమ పడతుంది. తద్వారా కూడ ఇంట్లో దుర్వాసన వస్తుంది. ఇలా తెరచి ఉంచడం వల్ల దుర్వాసన తొలగిపోతుంది.
ముఖ్యంగా ఇంట్లో అగరబత్తిలు, సువాసనను వెదజల్లే కొవ్వత్తులను వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మనకు మానసిక ప్రశాంతతతోపాటు ఇళ్లంతా పరిమళభరితంగా ఉంటుంది.