Actresses photos, videos leaked online, controversies: హీరోయిన్స్‌ని ఇబ్బందిపెట్టిన ఫోటోలు, వీడియోలు లీకేజ్ కాంట్రావర్శీలు

Fri, 18 Jun 2021-5:42 am,

Radhika Apte's nude video leak: రాధిక ఆప్టే న్యూడ్ వీడియో లీక్: రాధిక ఆప్టే నటించిన ఓ షార్ట్ ఫిలిం నుంచి లీకైన ఓ న్యూడ్ వీడియో అప్పట్లో ఆమెను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు.. ఇంట్లో పనిచేసే పనివాళ్ల నుంచి సెట్‌లో పనిచేసే వాళ్ల వరకు రాధికా ఆప్టేను చూసే దృక్పథం మారిపోయేలా చేసింది ఆ ఒక్క వీడియో లీకేజ్ (Radhika Apte's video leaked online).

ఆ వివాదం నుంచి ఇంకా తేరుకోక ముందే అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన మ్యాడ్లీ, అజయ్ దేవ్‌గన్ నిర్మించిన పార్చ్‌డ్ మూవీల నుంచి మరోసారి పలు న్యూడ్ వీడియోలు, ఫోటోలు లీక్ (Radhika Apte photos, videos leaked online) అయ్యాయి. దీంతో కొన్ని రోజుల వరకు ఇంట్లోంచి బయటికెళ్లాంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇటీవల బాలీవుడ్ లైఫ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే ఆవేదన వ్యక్తంచేసింది.

Nayanthara and Shimbu's romance: నయనతార, శింభుల రొమాన్స్ ఫోటోలు: సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న నయనతార కూడా ఒకప్పుడు ఆ వివాదాలు ఎదుర్కున్న హీరోయినే. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోనే తమిళ హీరో ప్లస్ రిచ్ కిడ్ అయిన శింభుతో ప్రేమలో పడిన నయనతార.. అతడితో లిప్ లాక్ చేస్తున్న ఫోటోలు (Nayanthara, Shimbu's steamy lilpck) అప్పట్లో సినీ పరిశ్రమను షేక్ చేశాయి.

వల్లభ సినిమాలో ఆ ఇద్దరి మధ్య రొమాన్స్ అంతగా పండటానికి కారణం అప్పట్లో వాళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉండటమే అనే టాక్ కూడా వినిపించింది.

Trisha bath room pics leaked: త్రిష బాత్రూమ్ పిక్స్ లీకేజ్ వ్యవహారం: త్రిష.. కొద్దికాలంలోనే తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో దాదాపు టాప్ హీరోయిన్స్ అందరి సరసన నటించిన హీరోయిన్. చక్కటి అందంతో అందరి మనసు దోచుకున్న త్రిషకు కూడా ఈ లీకేజ్ ఇబ్బందులు తప్పలేదు. త్రిష బాత్రూమ్ పిక్స్ అప్పట్లో ఇంటర్నెట్‌ని షేక్ చేశాయి.

కొన్నాళ్ల వరకు త్రిష ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. కానీ తరువాత ఆ వివాదాన్ని లెక్కచేయకుండా మళ్లీ వరుస సినిమాలు సైన్ చేస్తూ సినిమాలతో బీజీ అయ్యింది.

Hansika Motwani's private pictures: హన్సిక ప్రైవేట్ ఫోటోలు లీక్: హన్సిక.. దక్షిణాది అభిమానులకు అసలే పరిచయం అక్కర్లేని పేరు. దేశ ముదురు సినిమాలో లేలేత అందాలతో తెలుగు వారిని మెస్మరైజ్ చేసి తన బుట్టలో వేసుకున్న హన్సికను కూడా లీకేజ్ కాంట్రావర్శి ఇబ్బంది పెట్టింది. హన్సిక ప్రైవేటు ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వివాదంపై హన్సిక స్పందిస్తూ.. '' తాను బికీనీలో నటించడానికైనా వెనుకాడను కానీ ఇలా తనకు తెలియకుండా తన ప్రైవేటు ఫోటోలు లీక్ చేయడం మాత్రం తట్టుకోలేకపోతున్నాను'' అని వాపోయింది. 

Ranbir Kapoor and Katrina Kaif's holiday pics: రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ హాలీడే పిక్స్ లీకేజ్: రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ కలిసి సరదాగా టైమ్ పాస్ చేసేందుకని స్పెయిన్లోని ఇబిజాకు వెళ్లినప్పుడు, వారిని గుర్తుపట్టిన అభిమానులు ఫోటోలు క్లిక్‌మనిపించారు. ఆ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. వాళ్లిద్దరికి ఎదురైన ఆ చేదు అనుభవం చూసి బాలీవుడ్ షేక్ అయిపోయింది. సినిమా వాళ్లు సముద్రాలు దాటిపోయినా సరే వారికి ప్రైవసీ అనేది ఉండదు అనే విషయాన్ని వారికి తెలిసొచ్చేలా చేసింది ఈ ఘటన.

ఈ లీకేజ్ కాంట్రావర్శి చూసి కత్రినా కైఫ్ మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్‌ను కూడా చాలా ఫీలయ్యాడట.

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకదానిని మించిన ఘటనలు ఇంకొకటి ఇంకా చాలానే ఉన్నాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్.. ఒక్కో సినీ పరిశ్రమలో పెద్ద చేంతాడంత జాబితానే తయారవుద్ది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link