Fruits For Hair Growth: పొడవైన, ఒత్తైన జుట్టుకోసం..ఈ ఐదు రకాల పండ్లు తినండి..!!

Sun, 04 Aug 2024-6:04 pm,

Hair Growth: జుట్టు పొడవుగా ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది. జుట్టు పెరిగేందుకు మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. అవి తాత్కాలిక ప్రయోజనం ఇచ్చినప్పటికీ..కొన్ని సందర్బాల్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఒక్కోసారి మన నిర్లక్ష్యం కూడా జుట్టును బలహీనంగా మార్చుతుంది. వాతావరణంలో వచ్చిన మార్పులు లేదంటే కొత్త హెయిర్ స్టైల్ కోసం మనం చేసే ప్రయోగాల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అయితే ఊడిపోకుండా..బలంగా, ఒత్తుగా మారేందుకు కొన్ని పండ్లను మన డైట్లో చేర్చుకోవాలి. ఈ పండ్లు ఇమ్యూనిటీ లెవల్స్ పెంచడంతోపాటు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ పండ్లు జుట్టుకు అంతర్గత పోషణను అందిస్తాయి. జుట్టు మూలాల నుంచి బలంగా మారుతుంది. ఏ పండ్లు తినాలో ఇఫ్పుడు చూద్దాం.   

ఉసిరికాయ: జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఉసిరికాయను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఉసిరిని రెగ్యులర్ గా డైట్లో చేర్చుకుంటే జుట్టుకు అంతర్గా పోషణ అందించడంతోపాటు మూలాల నుంచి బలంగా మార్చుతుంది. దీంతో జుట్టు వేగంగా పెరగడంతో..సిల్కీగా మెరస్తూ ఉంటుంది.   

అరటిపండు: అరటిపండులో విటమిన్ ఎ, ఫైబర్, ఫొలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి జుట్టుకు బలాన్ని అందిస్తాయి. అంతేకాదు అరటి పండును రోజూ తింటే ఊడిపోయిన జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది. 

కివి: కివి పండులో పోషకాలు మెండు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. కేవలం జుట్టుకు మాత్రమే కాదు పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. 

అవకాడో: అవకాడోలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది తలలో రక్తప్రసరణ సరిగ్గా జరిగేలా చూస్తుంది. అంతేకాదు జుట్టుకు అంతర్గతంగా పోషణను అందిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.   

జామ: జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జామపండుతోపాటు విటమిన్ సి అధికంగా ఉన్న నారింజ, బెర్రీలు, ద్రాక్ష వంటి సీజనల్ పండ్లు తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link