Gandhi Jayanti 2021: గాంధీ జయంతి సందర్భంగా చూడాల్సిన టాప్ 5 చిత్రాలు

Fri, 01 Oct 2021-6:41 pm,

1) Gandhi (1982) - గాంధీ (1982) బ్రిటీష్ ఫిలిం మేకర్ రిచర్డ్ అటెన్ బర్గ్ తెరకెక్కించిన చిత్రం గాంధీ. 1982 లో విడుదలైన ఈ సినిమాలో బ్రిటీష్ యాక్టర్ బెన్ కింగ్‌స్లే మహాత్మా గాంధీ పాత్రలో నటించాడు. బ్రిటీష్ పాలనకు గాంధీజీ ఎలా చరమగీతం పాడారనేది ఈ సినిమాలో చూపించారు. సినిమా తెరకెక్కించిన తీరుకు ఆస్కార్ అవార్డులు సాహో అన్నాయి. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ లాంటి కేటగిరీలు అన్నీ కలిపి గాంధీ మూవీకి మొత్తం 8 ఆస్కార్ అవార్డులు (Oscar awards) వరించాయి.

2) Gandhi My Father (2007) - గాంధీ మై ఫాదర్ 2007 ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ తెరకెక్కించిన గాంధీ మై ఫాదర్ సినిమా గాంధీలో మరో కోణాన్ని చూపించింది. యావత్ జాతికి జాతి పితగా నిలిచిన గాంధీ తన సొంత కుమారుడి చేత మాత్రం ఒక మంచి తండ్రి అనిపించుకోలేకపోయారనే ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమా ఇది. దర్శన్ జరివాలా, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో నిజ జీవితంలో గాంధీకి, ఆయన వారసుడు హీరాలాల్‌కి మధ్య పెరిగిన దూరాన్ని చూపించారు. గాంధీ హత్య (Assassination of Mahatma Gandhi) తర్వాత కొద్ది రోజులకే అత్యంత పేదిరకంతో హీరాలాల్ చనిపోయినట్టు గాంధీ మై ఫాదర్ సినిమా చెబుతోంది. అనిల్ కపూర్ ఈ సినిమాను నిర్మించారు.

3) Hey Ram (2000) - హే రామ్ 2000 కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హే రామ్ మూవీ గాంధీ హత్యోదంతంపై ఫోకస్ చేస్తూ తెరకెక్కించారు. గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటనే కోణంలో ఈ సినిమా రూపొందించారు.

4) Lage Raho Munna Bhai (2010) - లగే రహో మున్నా భాయ్ 2010 లగే రహో మున్నా భాయ్. ఈ సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఈతరం ఆడియెన్స్ చూసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇది. పైగా ఇదే సినిమా తెలుగులో చిరంజీవి (Chiranjeevi) హీరోగా శంకర్ దాదా జిందాబాద్ అనే టైటిల్‌తో రీమేక్ అయి భారీ విజయాన్ని అందుకుంది. గాంధీగిరితో ఏదైనా సాధించొచ్చనే స్టోరీలైన్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.

5) The Making of Mahatma (1996) - ది మేకింగ్ ఆఫ్ మహాత్మ 1996 మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే సాధారణ పౌరుడు దేశం గర్వించే స్థాయిలో మహాత్మా గాంధీ ఎలా అయ్యారనే అంశంతో ది మేకింగ్ ఆఫ్ మహాత్మ సినిమా తెరకెక్కింది. దక్షిణాఫ్రికాలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం నుంచి కసితో స్పూర్తిని పొందిన గాంధీ.. భారత్‌కి తిరిగొచ్చి స్వాతంత్య్ర ఉద్యమానికి ఎలా నాయకత్వం వహించారు ? బ్రిటిషర్లను (How British rule ended in india) ఎలా దేశం నుంచి తరిమి కొట్టారనే అంశాలను ఈ సినిమాలో చూపించారు.

ఇవే కాకుండా ఇంకెన్నో లెక్కలేనన్ని సినిమాలు గాంధీజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కాయి (Movies on Mahatma Gandhi). గాంధీ జీవితంలో అందరికీ తెలిసిన విషయాల నుంచి మొదలు ఎవరికీ తెలియని కోణాల వరకు (Unknown facts in Gandhi life) ఎన్నో అంశాలు ఆ సినిమాల్లో చూపించారు.

Also read : RBI New Rules: మీ ఈఎంఐ చెల్లింపుల్లో కొత్త మార్పులు, ఇవాళ్టి నుంచి ఇలా చేయాల్సిందే

Also read : International Coffee Day: ప్రపంచ కాఫీ దినోత్సవం ఈరోజు, కాఫీతో ప్రయోజనాలు, నష్టాలివే

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link