Gold Price Today: నిర్మలమ్మ..సూపర్ అమ్మ..ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర..ఏకంగా 3వేలు.!!

Wed, 24 Jul 2024-5:26 pm,

Gold Price Down: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. వెండి, బంగారం ధరలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడంలో గోల్డ్, సిల్వర్ ధరలు నేలచూశాయి. ప్రస్తుతం పుత్తడి, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం. 

మొన్నటి వరకు అంతనంత ఎత్తులో ఉన్న బంగారం ధర నిన్నటి నుంచి నేలను  చూస్తుంది. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించారు. గోల్డ్, సిల్వర్ పై 15శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 6శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీని 6.4శాతంగా ప్రకటించారు ఆర్థిక మంత్రి. 

ఇక కేంద్రఆర్థిక మంత్రి ప్రకటనతో పుత్తడి ధర అమాంతం తగ్గిపోయింది. మల్టీ కమాడిటీ ఎక్స్ ఛేంజ్ లో బంగారం ధర భారీగా పడిపోయింది. ఎంసీఎక్స్ బంగారం ధర ఏకంగా 5.36శాతం పడిపోయింది. అంటే రూ. 3, 897 తగ్గింది. ప్రస్తుతం 68, 821 ధరకు పడిపోయింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. 4.21శాతం అంటే రూ. 3,753కి పోయింది. ప్రస్తుతం వెండి ధరరూ. 85,450కి చేరింది.   

బడ్జెట్ ఎఫెక్ట్  తో హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. 22క్యారెట్ల 10 గ్రాము బంగారం ధరపై ఏకంగా రూ. 2,750 మేర తగ్గింది. ప్రస్తుతం రూ. 67,700 నుంచి రూ. 64,950కి చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 2,900తగ్గి రూ. 73, 850 నుంచి రూ. 70, 860కి చేరింది. 

ఇక బంగారం ధర 3వేలు తగ్గడం అనేది పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇన్నాళ్లూ బంగారం కొనాలంటే భయపడ్డ వినియోగదారులు ఇప్పుడు గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వెండి కూడా 3,500తగ్గడంతో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.   

ఇక భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా పడిపోయే అవకాశం కూడా ఉందని మార్కెట్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. మనదేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి..కాబట్టి ఇదే సమయంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవ్వడంతో బంగారం కొనేవారికి ఎంతో ఊరటనిచ్చినట్లయింది.   

వచ్చేది శ్రావణ మాసం కాబట్టి పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. బంగారం, వెండి ధర తగ్గడంతో చాలా మంది కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ సమయంలో బంగారం, వెండికి డిమాండ్ పెరిగి మళ్లీ ధర కూడా పెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు నిపుణులు. మొత్తానికి బంగారం ధరలు తగ్గుతున్నాయనడం..గోల్డ్ లవర్స్ పెద్ద ఊరటనిచ్చే అంశమే అని చెప్పవచ్చు. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link