Gold Price In Hyderabad 13th July 2021: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు
Gold Rate Update 13th July 2021: కరోనా కేసులు తగ్గడంతో నేడు ఏపీ, తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో నిలకడగా ఉంది. ఢిల్లీలో వెండి ధరలు పెరగగా, హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలోనూ వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Also Read: BMW R 1250 GS Price: బీఎండబ్ల్యూ కంపెనీ నుంచి 2 స్పోర్ట్స్ బైక్స్, ధర చూస్తే షాక్
Gold Rate in Hyderabad: కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా ఏపీ, తెలంగాణ మార్కెట్లలో రూ.160 చొప్పున పెరిగింది. నేడు హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,880కు చేరుకుంది. 22 క్యారెట్లపై సైతం పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పుంజుకున్నా, ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. రెండు రోజుల తరువాత పసిడి ధరలు స్థిరంగా తగ్గాయి. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,840కి పతమైంది. 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారం ధర రూ.46,790కి దిగొచ్చింది.
Also Read: WhatsApp Features: మీరు వాట్సాప్ వాడుతున్నారా, అయితే ఈ సరికొత్త ఫీచర్లు మీకోసమే
బులియన్ మార్కెట్లో ఇటీవల దిగొచ్చిన వెండి ధరలు మరోసారి పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.300 మేర స్వల్పంగా పెరగడంతో నేడు 1 కేజీ వెండి రూ.69,400కు చేరుకుంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో రూ.600 మేర పుంజుకుంది. దీంతో నేడు హైదరాబాద్, విజయవాడలో 1 కేజీ వెండి ధర రూ.74,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook