Gold Price Today: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, భారీగా పెరిగిన Silver Price
Gold Price Today 09 February 2021: బులియన్ మార్కెట్‌లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు, వెండి ధరలు తాజాగా స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు యథాతథంగా ఉన్నాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా పెరిగింది.
Also Read: EPFO: జాబ్ మానేసిన ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్, ఇకనుంచి పాత కంపెనీతో పనిలేదు
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర గత రెండు రోజులుగా స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.48,070 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.44,060 వద్ద కొనసాగుతోంది.
Also Read: Credit Cards: క్రెడిట్ కార్డు బిల్లులను EMI రూపంలో చెల్లిస్తే మీకు 5 ప్రయోజనాలు
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇటీవల ఒక్కరోజు పెరిగాయి. తాజాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,390 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారం ధర రూ.46,190 వద్ద మార్కెట్ అవుతోంది.
ఫిబ్రవరి తొలి వారంలో ఢిల్లీలో తగ్గిన వెండి ధర తాజాగా భారీగా పెరిగింది. వెండి ధర రూ.1,000 మేర భారీగా పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.70,200 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.500 మేర పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.73,600కు చేరింది.
Also Read: Recharge Plans: ఎయిర్‌టెల్, Jio మరియు Vi అందిస్తున్న బెస్ట్ డేటా, కాలింగ్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే